యాప్నగరం

'అర్జున్ రెడ్డి'పై కేటీఆర్ ప్రశంసల జల్లు

సందేశాత్మక చిత్రాలు, ఆకట్టుకునే కథ, కథనం వున్న సినిమాలని ప్రోత్సహించేవారిలో తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్...

TNN 28 Aug 2017, 3:51 pm
సందేశాత్మక చిత్రాలు, ఆకట్టుకునే కథ, కథనం వున్న సినిమాలని ప్రోత్సహించేవారిలో తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ముందే వుంటారు. ఇటీవల నాని నటించిన నిన్ను కోరి, శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఫిదా సినిమాలపై ప్రశంల జల్లు కురిపించిన కేటీఆర్ తాజాగా 'అర్జున్ రెడ్డి' మేకర్స్‌ని అభినందించారు. కుండబద్ధలు కొట్టినట్టు చెప్పిన కథనం, పాత్రల్లోని నిజాయితీ వంటివన్నీ బాగున్నాయని ట్వీట్ చేసిన కేటీఆర్ ఆ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి, నిర్మాత ప్రణయ్‌లని అభినందించారు. అంతేకాకుండా 'అర్జున్ రెడ్డి' పాత్రను పోషించిన 'విజయ్ దేవరకొండను యు ఆర్ ఏ రాక్‌స్థార్' అని ప్రశసించారు కేటీఆర్.
Samayam Telugu minister ktr appreciates arjun reddy movie makers
'అర్జున్ రెడ్డి'పై కేటీఆర్ ప్రశంసల జల్లు

Raw. Intense. Honest. Original. Bold. Gutsy. Risqué#ArjunReddyKudos to Sandeep Reddy & Pranay👍Vijay Devarakonda you're a Rockstar🤘— KTR (@KTRTRS) August 27, 2017
గత వారం విడుదలైన అర్జున్ రెడ్డి సినిమా అటు ఓవర్సీస్‌లో, ఇటు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. 'పెళ్లిచూపులు' ఫేమ్ విజయ్ దేవరకొండ, కొత్త హీరోయిన్ శాలిని జంటగా నటించిన ఈ సినిమాకు యూత్ ఆడియెన్స్ నుంచి భారీ స్పందన కనిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.