యాప్నగరం

కాటమరాయుడు టైటిల్ సాంగ్ వచ్చేసింది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతిహాసన్ జంటగా తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజైంది.

Samayam Telugu 3 Mar 2017, 5:20 pm
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతిహాసన్ జంటగా తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజైంది. ఈ సినిమా ఆడియోను అభిమానులకి అందిస్తున్న ఆదిత్యా మ్యూజిక్ ముందుగా ప్రకటించినట్టుగానే ఇవాళ సాయంత్రం మిరా మిరా మీసం సాంగ్ రిలీజ్ చేసింది. గోపాల గోపాల ఫేమ్ కిషోర్ కుమార్ పార్థసాని డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని పవన్ సన్నిహిత మిత్రుడు శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. గోపాల గోపాల చిత్రానికి మ్యూజిక్ అందించిన అనూప్ రూబెన్సే మళ్లీ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడారు.
Samayam Telugu mira mira meesam song from katamarayudu movie released online
కాటమరాయుడు టైటిల్ సాంగ్ వచ్చేసింది


సినిమాలోని పాటలన్నింటినీ ఒకేరోజు ఆడియో ఫంక్షన్ నిర్వహించి రిలీజ్ చేయకుండా... సినిమా విడుదలకి కొన్ని రోజుల ముందు నుంచే ఒక్కో పాటని రిలీజ్ చేయడం ఈమధ్య ఓ ట్రెండ్ అయిపోయింది. ఈ ట్రెండ్ సంగతి ఎలా వున్నా... ఇప్పుడు రిలీజైన ఈ మిరా మిరా మీసం సాంగ్ యూట్యూబ్‌లో ఇంకెన్ని ట్రెండ్స్ సెట్ చేయనుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాటమరాయుడు టీజర్ సృష్టించిన హంగామా అంటువంటిది మరి.
ఫిబ్రవరి 4న రిలీజైన ఈ టీజర్ ఇప్పటికే 9 మిలియన్ల వ్యూస్‌ని సొంతం చేసుకుని కోటీ వ్యూస్ వైపు దుసుకెళ్తోంది. ఇక ఈ 'మిరా మిరా మీసం' సాంగ్ ఇంకెన్ని వ్యూస్‌ని సొంతం చేసుకోనుందో వేచిచూడాల్సిందే మరి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.