యాప్నగరం

పిక్‌టాక్: హీరోయిన్లకు ధీటుగా హీరోభార్య!

ఆమె గ్లామర్ ముందు బాలీవుడ్ తారామణులు కూడా వెలవెలబోతున్నారు.

TNN 1 Nov 2017, 2:36 pm
ఆమె గ్లామర్ ముందు బాలీవుడ్ తారామణులు కూడా వెలవెలబోతున్నారు. కరీనాకపూర్ వంటి స్టార్ హీరోయిన్ ని, గ్లామరస్ బ్యూటీని షాహిద్ కపూర్ మిస్సయ్యాడు కానీ.. అంతకు మించిన గ్లామరస్ బ్యూటీని వివాహం చేసుకున్నాడు. ఇప్పటికే షాహిద్ భార్య మీరా రాజ్‌పుత్‌పై బాలీవుడ్ కూడా మనసు పారేసుకుంది. ఆమెను హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేసే యత్నంలో ఉన్నారు బాలీవుడ్ మూవీ మేకర్లు. అయితే వాళ్లకు అలాంటి అవకాశాన్ని ఇంకా ఇవ్వలేదు మీరా.
Samayam Telugu mira rajputsimply wonderful
పిక్‌టాక్: హీరోయిన్లకు ధీటుగా హీరోభార్య!




అయితే తాజాగా ఒక మ్యాగజైన్ కవర్ ఫొటో కోసం పోజులిచ్చారు ఈ భార్యభర్తలు. సాధారణంగా భార్యభర్తలను ఇలా కవర్ పేజీ మీద చూపించారంటే.. వాళ్లిద్దరూ సెలబ్రిటీలే అయ్యుంటారు. పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లను, స్పోర్ట్స్ పర్సనాలిటీలతో ఇలా పొటో షూట్ నిర్వహించి ప్రచురిస్తూ ఉంటారు. మీరా రాజ్‌పుత్ కు ఎలాంటి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినప్పటికీ.. ఈ జంటను కవర్ పేజీ మీదకు ఎక్కించారు. మొత్తానికి బాలీవుడ్‌లో, సినీ జనాల మధ్య షాహిద్ భార్యకు ఎంత క్రేజ్ ఉందో చాటి చెబుతోంది ఈ మ్యాగజైన్ కవర్ ఫొటో!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.