యాప్నగరం

మోహన్ బాబు ‘గాయత్రి’ రిలీజ్ డేట్ ఫిక్స్!

డైలాగ్ కింగ్ మోహన్ బాబు అప్ కమింగ్ మూవీ ‘గాయత్రి’ విడుదలకు సిద్ధమైంది.

TNN 14 Dec 2017, 2:57 pm
డైలాగ్ కింగ్ మోహన్ బాబు అప్ కమింగ్ మూవీ ‘గాయత్రి’ విడుదలకు సిద్ధమైంది. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సొంత బేనర్‌లో మోహన్ బాబు నటిస్తూ.. నిర్మిస్తున్న ‘గాయత్రి’ చివరి దశ షూటింగ్ పూర్తి కావడంతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేస్తున్నట్టు మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ చిత్రంలో మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు కూడా ఓ కీ రోల్ చేస్తుండగా.. ఇటీవల రామోజీఫిల్మ్ సిటీలో మోహన్ బాబు, విష్ణులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
Samayam Telugu mohan babu confirms the release date of gayatri
మోహన్ బాబు ‘గాయత్రి’ రిలీజ్ డేట్ ఫిక్స్!


మదన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విష్ణు సరసన సీనియర్ నటి శ్రియ నటిస్తుండగా.. నిఖిల విమల టైటిల్ రోల్ చేస్తోంది. ఎస్. ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ‘గాయత్రి’ చిత్రంలో జబర్దస్త్ యాంకర్ అనసూయ మరో ముఖ్య పాత్రలో సందడి చేయనుంది. ​ తాజాగా గాయత్రి రిలీజ్ డేట్‌ను ప్రకటించిన మోహన్ బాబుకు కుర్రహీరో నిఖిల్‌తో బాక్సాఫీస్ వద్ద వార్ తప్పేట్లు లేదు. నిఖిల్ నటించిన ‘కిర్రాక్ పార్టీ’ మూవీ కూడా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ రెండు సినిమాల వార్ తప్పనిసరి అయ్యింది.
#GayatriOnFeb9th pic.twitter.com/49gGHPaZzo — Mohan Babu M (@themohanbabu) December 14, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.