యాప్నగరం

జిమిక్కి కమ్మల్.. న్యూ వెర్షన్, సూపర్ హిట్!

ఓనం సందర్భంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ కామర్స్ లో కొంతమంది అతివలు నర్తించిన ‘జిమిక్కి కమ్మల్’ డాన్స్ వీడియో ఎంత పెద్ద హిట్టైందో

TNN 25 Sep 2017, 12:03 pm
ఓనం సందర్భంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ కామర్స్ లో కొంతమంది అతివలు నర్తించిన ‘జిమిక్కి కమ్మల్’ డాన్స్ వీడియో ఎంత పెద్ద హిట్టైందో వేరే వివరించనక్కర్లేదు. ఇప్పటి వరకూ ఈ వీడియోను యూట్యూబ్ లో అక్షరాలా 1,69,70,397 మంది వీక్షించారు. ఇక ఈ వీడియోకు వచ్చినన్ని పేరడీలు, అనుకరణలు ఈ మధ్య కాలంలో మరే వీడియోకూ రాలేదని చెప్పవచ్చు. ఓవరాల్ గా దక్షిణాదిన చర్చనీయాంశంగా మారిపోయింది ఆ వీడియో.
Samayam Telugu mohanlal takes jimikki kammal dance challenge and nails it
జిమిక్కి కమ్మల్.. న్యూ వెర్షన్, సూపర్ హిట్!


మరి ఇప్పుడు దీనికి సంబంధించిన మరో వెర్షన్ వచ్చింది. ఇది కేరళలలోని ఒక కాలేజీ విద్యార్థులు రూపొందించినదే. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఈ వెర్షన్లో మోహన్ లాల్ కూడా మెరుస్తాడు. విద్యార్థులకు లాల్ కూడా తోడై.. జిమిక్కి కమ్మల్ స్టెప్పులు వేస్తాడు. మోహన్ లాల్ ఈ వీడియోలో కనిపిస్తుండటంతో దీనికి ఎనలేని ఆదరణ లభిస్తోంది. విడుదల అయిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షించారు.

వాస్తవానికి జిమిక్కి కమల్ సాంగ్ మోహన్ లాల్ తాజా సినిమా ‘వెలిపడింతే పుస్తకం’లోనిది. సినిమాలోని ఆ పాట సూపర్ హిట్. దానికే ఇండియన్ స్కూల్ ఆఫ్ కామర్స్ అతివలు డాన్స్ చేసి సంచలనం రేపారు. సినిమాలోని పాటలో మోహన్ లాల్ కనిపిస్తాడు. పాట పూర్తి అవుతున్నప్పుడు సైకిల్ మీద ఎంట్రీ ఇస్తాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.