యాప్నగరం

ఎలగెలగా.. మోక్షజ్ఞ సినిమాల్లోకి రాడా!! మరి?

నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞను సినిమాల్లోకి తీసుకురావాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ

TNN 19 Apr 2017, 11:25 pm
నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞను సినిమాల్లోకి తీసుకురావాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ సరైన దర్శకుడు దొరకకపోవడంతో మోక్షు ఎంట్రీ ఆలస్యం అవుతుందని చెబుతున్నారు.
Samayam Telugu mokshagna interested in business
ఎలగెలగా.. మోక్షజ్ఞ సినిమాల్లోకి రాడా!! మరి?


నిజానికి బాలయ్య తన కుమారుడి మొదటి సినిమా ప్రస్తుతం ఉన్న అగ్ర దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, బోయపాటి వంటి వారితో చేయాలనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు వారంతా ఫుల్ బిజీ.. ఇప్పట్లో వారికి ఖాళీ దొరికే అవకాశం కూడా లేదు. ఈ కారణంగానే మోక్షజ్ఞ తెరంగేట్రం ఆలస్యం అవుతుందని అనుకుంటున్నారు.

ఈ సినిమాను తనే నిర్మిస్తానని నిర్మాత సాయి కొర్రపాటి ముందుకొచ్చిన సంగతి కూడా తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం.. మోక్షజ్ఞకు సినిమాల మీద ఆసక్తి లేదట. తనకు సినిమాల కంటే వ్యాపారం మీదే మక్కువ ఎక్కువ అని తెలుస్తోంది. సొంతంగా బిజినెస్ మొదలుపెట్టి వ్యాపారవేత్తగా వెలుగొందాలనేది మోక్షు ఆలోచన అని తెలుస్తోంది.

కానీ తన తండ్రి సినిమాల్లోకి రమ్మంటే మాత్రం మోక్షజ్ఞ నో చెప్పే అవకాశాలు లేవు. తండ్రి మాటకు అంత విలువనిస్తాడని సమాచారం. మరి మోక్షజ్ఞ తన ఆలోచనలను బిజినెస్ నుండి సినిమాల్లోకి షిఫ్ట్ చేస్తాడేమో చూడాలి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.