యాప్నగరం

బిగ్‌బాస్‌కు షాక్: ఆదిలోనే ఆమె ఎగ్జిట్?!

ఆసక్తికరమైన రీతిలో ఆరంభం అయిన ఎన్టీఆర్ బిగ్‌బాస్ కు కొన్ని ఆటంకాలు తప్పేలా లేవు.

TNN 18 Jul 2017, 2:30 pm
ఆసక్తికరమైన రీతిలో ఆరంభం అయిన ఎన్టీఆర్ బిగ్‌బాస్ కు కొన్ని ఆటంకాలు తప్పేలా లేవు. మామూలుగా బిగ్‌బాస్ హౌస్ చుట్టూ వివాదాలు చుట్టుముడుతూ ఉంటాయి. తెలుగు బిగ్‌బాస్ విషయంలో కూడా అదే జరుగుతోంది. టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారం ప్రభావం బిగ్‌బాస్ మీద పడుతోంది. డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ నోటీసులు ఎదుర్కొన్న వాళ్లలో ఒకరు బిగ్‌బాస్ లో పాల్గొంటున్న వారిలో ఉండటంతో.. ఇప్పుడు ఏమవుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.
Samayam Telugu mumaith to exit biggboss house
బిగ్‌బాస్‌కు షాక్: ఆదిలోనే ఆమె ఎగ్జిట్?!


ఇటీవల వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో ఈ నెల 21 వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా ఎక్సైజ్ శాఖ అధికారులు నటి ముమైత్ ఖాన్ కు నోటీసులు ఇచ్చారు. డ్రగ్స్ వ్యవహారంలో ఉన్న సెలబ్రిటీలందరికి తలా ఒక డేట్ ఇచ్చి.. ఆ రోజున విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో ముమైత్ ఖాన్ వంతు ఈ నెల 21వ తేదీన వచ్చింది.

మరి ప్రస్తుతం ఆమె ‘బిగ్‌బాస్’ హౌస్ లో ఉన్నారని చెప్పాలి. ఇటీవలే బిగ్‌బాస్ షో ప్రసారం మొదలైంది. కొంత కాలం కిందటే ఈ కార్యక్రమం షూటింగ్ మొదలైంది. ఒకవేళ మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తి అయి ఉంటే ఇబ్బందే లేదు. అలాగాక ఇప్పటి వరకూ పూర్తి అయిన షూటింగ్ పార్ట్ లోనే ముమైత్ ఖాన్ ఎగ్జిట్ అయి ఉన్నా ఇబ్బంది లేదు. అలా కాకుండా.. షూటింగ్ కొనసాగుతూ ఉండి, ముమైత్ హౌస్ లోనే ఉంటే.. అప్పుడు బిగ్‌బాస్ కు లాస్ తప్పదు.

ఏ కారణం చేత అయినా ఒక్కసారి హౌస్ నుంచి ఎగ్జిట్ అయితే.. మళ్లీ అందులోకి రీ ఎంట్రీ ఉండదు. సదరు సెలబ్రిటీ షో నుంచి నిష్క్రమించినట్టే. ఇప్పుడు ముమైత్ ఖాన్ కు అలాంటి ఇబ్బందే వస్తోంది. ఎక్సైజ్ శాఖ విచారణకు హాజరు కావాలంటే.. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు రావాలి, బయటకు వస్తే.. మళ్లీ లోపలకు వెళ్లడం కుదరదు. ఇది కేవలం ముమైత్ కే కాదు, బిగ్‌బాస్ నిర్వాహకులకు కూడా లాసే. ముమైత్ ఖాన్ బయటకు వస్తే.. షోపై ఉన్న ఆసక్తి లో ఎంతో కొంత తగ్గకమానదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.