యాప్నగరం

Kareema Begum: ఏఆర్ రెహమాన్‌కు మాతృ వియోగం

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి కరీమా బేగం సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు.

Samayam Telugu 28 Dec 2020, 2:53 pm
ఆస్కార్‌ అవార్డు గ్రహీత, సుప్రసిద్ధ సంగీత దర్శకుడు‌ ఏఆర్‌ రెహమాన్‌ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి కరీమా బేగం సోమవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో ఈ లోకాన్ని విడిచారు. కరీమాకు నలుగురు సంతానం కాగా.. రెహమాన్ చిన్నవాడు. తొమ్మిదేళ్ల వయసులోనే రెహమాన్ తండ్రి ఆర్‌కే శేఖర్‌ చనిపోగా.. ఇప్పుడు తల్లిని కూడా కోల్పోయారు.
Samayam Telugu కరీమా బేగం, ఏఆర్ రెహమాన్


Also Read: ప్రభాస్ అంటే చాలా ఇష్టం.. ఛాన్స్ దొరికితే ఆయనతో ఒక్కసారైనా: వరలక్ష్మీ శరత్‌కుమార్

శేఖర్ మరణం తర్వాత కరీమాబేగం (కస్తూరి శేఖర్)తో కలిసి రెహమాన్ (దిలీప్) ఇస్లాం మతం స్వీకరించి పేర్లు మార్చుకున్నారు. రెహమాన్‌కు తల్లితో అనుబంధం ఎక్కువ. ఈ విషయాన్ని ఆయన అనేక ఇంటర్వ్యూల్లో చెప్పేవారు. తాను కెరీర్లో ఎదిగే క్రమంలో ప్రతి కీలక ఘట్టంలో తల్లి నిర్ణయాలు, మద్దతు ఉన్నాయని వెల్లడించేవారు. కరీమా బేగం మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్థున్నారు.

Also Read: ‘వకీల్ సాబ్’ టీజర్ రెడీ.. ఆ రోజు రిలీజ్‌కు సన్నాహాలు.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.