యాప్నగరం

ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీ లహరి కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీ లహరి (70) కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Samayam Telugu 16 Feb 2022, 9:56 am
గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీ లహరి కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 70 సంవత్సరాలు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
Samayam Telugu సంగీత దర్శకుడు బప్పీ లహరి కన్నుమూత
Bappi Lahiri


బాలీవుడ్‌లో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వెలుగొందిన బప్పీ లహరి తెలుగులో కొన్ని సినిమాలకు బాణీలు కట్టారు. ముఖ్యంగా చిరంజీవి సినిమాలకు ఆయన అందించిన మ్యూజిక్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అట్రాక్ట్ చేసింది. 80, 90 దశకాల్లో ఎన్నో మరపురాని ఆణిముత్యాలు అందించారు బప్పీ లహరి. చివరగా 2020లో వచ్చిన భాగి 3లో ఓ పాట పాడారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
లవ్ ఎఫైర్‌పై శ్రీముఖి క్లియర్ హింట్! ఓపెన్ అయిన బ్యూటీ
ఊపు తెప్పించే ఎనర్జిటిక్ సాంగ్స్‌కు పెట్టింది పేరు బప్పీ లహరి. హిందీ చిత్రరంగానికి డిస్కో సంగీతం పరిచయం చేసిన ఘనత ఆయనదే. తెలుగులో మొదటగా సింహాసనం సినిమాకు సంగీతం అందించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా రూపొందిన ఈ సినిమా లోని పాటలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి.

ఆ తర్వాత చిరంజీవి హీరోగా వచ్చిన 'గ్యాంగ్ లీడర్' చిత్రానికి ఆయన కట్టిన బాణీలు నేటి తరాన్ని కూడా ఉర్రూతలూగిస్తున్నాయి. హిందీలో ఎన్నో సినిమాలకు సంగీతం అందించి పాపులర్ అయిన బప్పీ లహరి.. తెలుగులో ''స్టేట్ రౌడీ, రౌడీ అల్లుడు, సామ్రాట్, రౌడీ ఇన్‌స్పెక్టర్ లాంటి సినిమాలకు సంగీతం సమకూర్చి తన మార్క్ చూపించారు. చివరగా తెలుగులో 2020లో రవితేజ హీరోగా వచ్చిన 'డిస్కో రాజా' సినిమాలో టైటిల్ సాంగ్ పాడారు బప్పీ లహరి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.