యాప్నగరం

అమ్మకు ప్రేమతో.. దేవిశ్రీ ప్రసాద్ సర్‌ప్రైజ్

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తన అమ్మను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ పెట్టారు. తన తల్లి శిరోమణి పుట్టినరోజట. ఈ సందర్భంగా తనదైన శైలిలో ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Samayam Telugu 27 Aug 2019, 1:12 pm
దేవిశ్రీ చెప్పే విషెస్ కాస్త విభిన్నంగా ఉంటాయి. ఏదన్నా పండగ వచ్చినా, ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నా ఆయన తనదైన శైలిలో శుభాకాంక్షలు చెబుతుంటారు. ఎవరికి విష్ చేసినా ‘హ్యాపీయెస్ట్ మ్యూజికల్ బర్త్‌డే’ అంటూ విష్ చేస్తారు. ఈరోజు దేవిశ్రీ తల్లి శిరోమణి పుట్టినరోజు. ఈ సందర్భంగా తన తల్లికి విష్ చేస్తూ ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టారు.
Samayam Telugu devisri prasad


‘హ్యాపీయెస్ట్ మ్యూజికల్ బర్త్‌డే అమ్మా. మా అమ్మ సంతోషంగా ఉండటానికి మీ ఆశీస్సులు కావాలి. లవ్యూ అమ్మా.. ఆమె కోసం నేను ఓ ప్రత్యేకమైన వీడియోను రూపొందించాను. సాయంత్రం విడుదల చేస్తాను. దయచేసి ఆ సర్‌ప్రైజ్ గురించి అమ్మకు చెప్పకండి’ అని పేర్కొన్నారు. తన తల్లితో కలిసి దిగిన ఫొటోలను ఈ సందర్భంగా దేవిశ్రీ అభిమానులతో పంచుకున్నారు.

ప్రస్తుతం ఆయన మహేశ్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’, చిరంజీవి 152వ సినిమా, అల్లు అర్జున్ 20వ సినిమా, నితిన్ నటిస్తున్న ‘రంగ్ దే’ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.