యాప్నగరం

నాగ్, దిల్‌రాజు.. రెచ్చగొట్టుకోవడం లేదు!

రెండు భారీ సినిమాలు ఒకే సమయంలో విడుదల కావడం అంటే అది ఇండస్ట్రీలో లేనిపోని ఉద్రిక్తతలను రెచ్చగొట్టడమే అనుకునే రోజులు ఇవి.

TNN 19 Dec 2017, 2:45 pm
రెండు భారీ సినిమాలు ఒకే సమయంలో విడుదల కావడం అంటే అది ఇండస్ట్రీలో లేనిపోని ఉద్రిక్తతలను రెచ్చగొట్టడమే అనుకునే రోజులు ఇవి. పండగ సీజన్లను, సెలవులను పక్కన పెడితే.. నాన్ సీజన్ లలో రెండు మూడు సినిమాలు ఒకేసారి వచ్చే సందర్భాల్లో వాటి రూపకర్తల మధ్య వివాదాలు మొదలవుతూ ఉంటాయి. మొదట్లో సంప్రదింపులు చేసుకుని సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవడం చేస్తూ ఉంటారు. ఒకవేళ అలాంటి పరస్పర సహకారం లేకపోతే.. ఆయా సినిమాల రూపకర్తలు మొహాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడని పరిస్థితి తలెత్తుతూ ఉంటుంది. ఆఫ్ ద రికార్డు అయినా అలాంటి వాళ్లు రెచ్చగొట్టుకునే ప్రకటనలు చేయడం జరుగుతూ ఉంటుంది.
Samayam Telugu nag dil raju treading cautiously
నాగ్, దిల్‌రాజు.. రెచ్చగొట్టుకోవడం లేదు!


అయితే వీటికి మినహాయింపులా కనిపిస్తున్నారు దిల్ రాజు, నాగార్జున. వీళ్లిద్దరి ప్రత్యేకతలను, నేపథ్యాలను వేరే చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరోగా, ప్రముఖ నిర్మాతగా నాగార్జున టాప్ స్టేటస్ లో ఉన్నాడు. అలాగే రాజు నంబర్ వన్ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. వీళ్లిద్దరి రూపకల్పనలో వస్తున్న సినిమాలు ఒకే వారంలో విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో సహజంగానే వీరిద్దరి మధ్య కాస్తంత ఉద్రిక్త పరిస్థితి ఉంటుందని అనుకుంటారు ఎవరైనా.

తమ సినిమా కోసం మరొకరి సినిమా విడుదలను వాయిదా వేయించాలని చూడటం, ఆ రకమైన ఒత్తిడి తీసుకురావడం, సంప్రదింపుల ద్వారానో, మరోరకంగా వాతావరణాన్ని వేడెక్కించి సినిమాకూ, సినిమాకూ ఎడం ఉండేలా చూసుకోవాలని చూడటానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు ఈ ఇద్దరూ. అటు ఎంసీఏ, ఇటు హలో ఒకే వారంలో విడుదల.

వీటిల్లో ఎంసీఏ కన్నా హలో సినిమాకే ఎక్కువ టెన్షన్. అఖిల్ తొలి సినిమా పోయింది. ఈ సారి కచ్చితంగా హిట్టు కొట్టాలన్న టెన్షన్ నాగ్ కు ఉంది. ఇక ఎంసీఏ మీద రాజు భారీ పెట్టుబడే పెట్టాడు. దాన్ని రాబట్టుకోవాలి. ఇలా ఇద్దరికీ కీలకమైన సినిమాలే. అయినా కూడా పోటీవాతావరణంలో వీళ్లిద్దరూ చాలా కామ్ గా తమ పని చేసుకుంటున్నారు. ఎవరి సినిమా వారిదిగా సాగుతున్నారు. ఆహ్వానించదగిన పోటీ ఇది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.