యాప్నగరం

ఆ హీరోయిన్ కోసం రూ.50లక్షలు వదులుకున్న చైతూ?

నాగ చైతన్య తాజా చిత్రం ప్రేమమ్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

TNN 9 Jun 2016, 12:12 pm
నాగ చైతన్య తాజా చిత్రం ప్రేమమ్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో శ్రుతి హాసన్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. కాగా మొదట ఈ సినిమాలోకి శ్రుతిహాసన్‌ను తీసుకోవాలని అనుకోలేదు. అయితే నాగ చైతన్య మాత్రం శ్రుతినే హీరోయిన్ గా కావాలని పట్టుపట్టాడట. ఆమె సినిమాలో ఉంటే హిట్ కొట్టొచ్చని నమ్మకమట. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రుతిని సినిమాలో పెట్టుకుంటే ఆమె అడిగే భారీ పారితోషికం ఇవ్వలేమని, చిత్రం బడ్జెట్ అమాంతం పెరిగిపోతుందని చెప్పారట నిర్మాతలు. అయినా చైతూ ఒప్పుకోకుండా... తన రెమ్యునరేషన్లోంచి రూ.50లక్షలు తగ్గించుకున్నాడట. ఆ డబ్బుని శ్రుతి పారితోషికానికి ఉపయోగించుకోమని కూడా చెప్పాడుట. అలా శ్రుతి హాసన్ ప్రేమమ్ లో హీరోయిన్ గా ఎంపికైంది. ఆగస్టు 12న సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది చిత్రయూనిట్.
Samayam Telugu naga chaitanya lost rs 50 lakh for shruthi
ఆ హీరోయిన్ కోసం రూ.50లక్షలు వదులుకున్న చైతూ?


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.