యాప్నగరం

ఘనంగా నాగచైతన్య,సమంత నిశ్చితార్థం

సినీనటుడు అక్కినేని నాగచైతన్య, నటి సమంత నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఎన్-కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది

TNN 29 Jan 2017, 10:09 pm
సినీనటుడు అక్కినేని నాగచైతన్య, నటి సమంత నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఎన్-కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ‘మా అమ్మ నాకూతురైంది’ అంటూ నిశ్చితార్థ వేడుక ఫోటోలను నాగార్జున ట్విటర్‌లో పోస్టు చేశారు. నాగచైతన్య, సమంత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి రెండు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో ఆదివారం నిశ్చితార్థ వేడుక జరిగింది.
Samayam Telugu naga chaitanya samantha engagement
ఘనంగా నాగచైతన్య,సమంత నిశ్చితార్థం


సమంత-చైతు నిశ్చితార్థం ముందునుండి అనుకున్నట్లుగానే రెండు మత సాంప్రదాయ పద్దతుల్లో నిర్వహించినట్లు తెలుస్తోంది. బంధువులు , కొంతమంది సినీ పెద్దల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. ఈ నూతన జంటకు టాలీవుడ్‌, బాలీవుడ్‌కి చెందిన సెలబ్రిటీలు ట్విట్టర్‌లో శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.