యాప్నగరం

ప్రేయసి కోసం ప్రొడ్యుసర్‌గా చైతు!

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న హాట్ టాపిక్స్‌లో చైతు, సమంతల ప్రేమ వ్యవహారం కూడా ఒకటి. వీరికి సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా.. బాగా హైలైట్ అవుతోంది.

TNN 27 Jan 2017, 8:29 pm
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న హాట్ టాపిక్స్‌లో చైతు, సమంతల ప్రేమ వ్యవహారం కూడా ఒకటి. వీరికి సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా.. బాగా హైలైట్ అవుతోంది. రీసెంట్‌గా సమంత, చైతు కోసం ఓ బైక్‌ను గిఫ్ట్‌గా ప్రెజంట్ చేసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తన ప్రియురాలు సమంత కోసం చైతు ఏకంగా నిర్మాతగా మారడానికి రెడీ అవుతున్నట్లు టాక్.
Samayam Telugu naga chaitanya to produce u turn for samantha
ప్రేయసి కోసం ప్రొడ్యుసర్‌గా చైతు!


అసలు విషయంలోకి వస్తే.. కొంత కాలం క్రితం కన్నడలో వచ్చిన 'యూటర్న్' సినిమా అక్కడ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా సమంతను బాగా ఆకర్షించడంతో ఈ సినిమా రీమేక్ లో నటించాలని డిసైడ్ అయింది. కన్నడంలో డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఆ దిశగా పవన్ ఇప్పటికే సమంతను చాలా సార్లు సంప్రదించారు.

అయితే ఇప్పుడు ఈ చిత్రానికి నిర్మాతగా నాగచైతన్య వ్యవహరించనున్నాడని చెబుతున్నారు. ఈ విషయంపై పవన్ కుమార్‌ను కలవడానికి సమంత, చైతు బెంగుళూరు కూడా వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చైతు తనకు కాబోయే లైఫ్ పార్ట్నర్ గురించి ఓ సినిమాను నిర్మిస్తుండడం అటు అక్కినేని అభిమానులకు, ఇటు సమంత అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.