యాప్నగరం

చైతూ కొత్త సినిమా ఫస్ట్ లుక్

రారండోయ్ వేడుక చూద్దాం మూవీ తర్వాత నాగ చైతన్య చేస్తున్న మరో కొత్త చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది.

Samayam Telugu 2 Jul 2017, 4:39 pm
రారండోయ్ వేడుక చూద్దాం మూవీ తర్వాత నాగ చైతన్య చేస్తున్న మరో కొత్త చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. యుద్ధం శరణం పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ లోగో సైతం ఇదే ఫస్ట్‌లుక్‌తోపాటే విడుదలైంది. రారండోయ్ వేడుక చూద్దాం సక్సెస్‌తో మాంచి జోష్ మీదున్న చైతూ అదే ఉత్సాహంతో యుద్ధం శరణం మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ద్వారా కృష్ణ మరిముత్తు అనే ఓ కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.
Samayam Telugu naga chaitanyas yudham sharanams first look revealed
చైతూ కొత్త సినిమా ఫస్ట్ లుక్

#NC14FirstLook #YuddhamSharanam thank you @krishnammuthu @ssk1122 @VaaraahiCC the dream team ! Hope you guys like it ! pic.twitter.com/WI1XSmituP— chaitanya akkineni (@chay_akkineni) July 2, 2017
ఈగ, లెజెండ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలు నిర్మించిన వారాహీ చలన చిత్రం బ్యానర్ ఈ సినిమాను ప్రోడ్యూస్ చేస్తోంది. హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తుండగా రావు రమేష్, రేవతి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాత సాయి కొర్రపాటి ప్లాన్ చేస్తున్నారు.
ప్రతి అడుగు ఒక యుద్ధంప్రతి శ్వాస ఒక గెలుపుఇక మొదలు #యుద్ధంశరణo #YuddhamSharanam👍#NC14FirstLook pic.twitter.com/QniXfQ1OsM— S.S.Karthikeya (@ssk1122) July 2, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.