యాప్నగరం

అల్లు అర్జున్ అలా.. నాగబాబు ఇలా! ఎన్నో ఊహలు కానీ చివరకు నిరాశ తప్పలేదు మరి..

నిన్న (ఆదివారం) జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ తిలకించారు మెగా ఫ్యామిలీ మెంబర్స్. అల్లు అర్జున్ ఇంట్లోనే కూర్చొని మ్యాచ్ వీక్షించగా, నాగబాబు స్టేడియంలో ఎంజాయ్ చేశారు.

Samayam Telugu 25 Oct 2021, 12:50 pm
చాలామంది సినిమా స్టార్స్ క్రికెట్ అంటే తెగ ఇష్టపడుతుంటారు. కొందరు టీవీలకు అతుక్కుపోతే.. ఇంకొందరు ఏకంగా స్టేడియం వెళ్లి క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అందునా భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇంకేమన్నా ఉందా? సెలబ్రిటీలు మొదలుకొని సాధారణ జనం వరకు ఏ ఒక్కరూ ఈ మ్యాచ్ వదిలిపెట్టరు. ఈ క్రమంలోనే నిన్న (ఆదివారం) జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ తిలకించారు మెగా ఫ్యామిలీ మెంబర్స్.
Samayam Telugu అల్లు అర్జున్ అలా.. నాగబాబు ఇలా!
Nagababu Allu Arjun


ఆదివారం రోజు భార‌త్ -పాకిస్తాన్ మ‌ధ్య జ‌రిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియాపై పాకిస్తాన్ నెగ్గింది. భారత్ ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు కానీ అలా జరిగిపోయింది. మ్యాచ్ జయాపజయాల సంగతి అటుంచితే ఆదివారం సెలవు దినం కావడంతో ఈ మ్యాచ్ ఎంజాయ్ చేశారు మెగా హీరోలు. అల్లు అర్జున్ ఇంట్లోనే కూర్చొని అర్హ, అయాన్‌లతో కలిసి క్రికెట్ వీక్షించగా.. మెగా బ్రదర్ నాగబాబు మాత్రం తన కొడుకు వరుణ్ తేజ్‌తో కలిసి స్టేడియంలో ఎంజాయ్ చేశారు. అదే విధంగా అక్ష‌య్ కుమార్, ప్రీతి జింతా లాంటి స్టార్స్ స్టేడియంలో సంద‌డి చేశారు.

అల్లు అర్జున్ సరదాగా మ్యాచ్ చూస్తున్న వీడియోను ఆయన భార్య స్నేహా రెడ్డి త‌న ఇన్‌స్టా స్టేట‌స్‌లో షేర్ చేసింది. అలాగే నాగబాబు సైతం మ్యాచ్ చూస్తున్న ఫోటోను తన ఇన్‌స్టా ఖాతా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రేమ పక్షులు నయన్- విగ్నేష్‌లకు సమంత కంగ్రాట్స్.. అలా కామెంట్ చేయడంతో ఇష్యూ వైరల్
ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప' సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబ‌ర్ 17న విడుద‌ల కానుంది. అదేవిధంగా వరుణ్ తేజ్ 'గని' సినిమా పనులతో బిజీ బిజీగా ఉన్నారు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.