యాప్నగరం

Naga Babu: నిహారిక వెళ్లిపోతోందిగా! ఇక నా టైమ్‌పాస్ అంతా.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్

ఏ తండ్రికైనా తన కూతురు పెళ్లి చేసి మరో ఇంటికి పంపించడం ఓ మెమరబుల్ మూమెంట్. తాజాగా అదే మూడ్‌లో ఉన్న నాగబాబు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

Samayam Telugu 6 Dec 2020, 5:17 pm
ఆడపిల్ల పెళ్లి అంటే ప్రతి ఇంట్లో అదో మహా వైభోగం. తల్లిదండ్రులు తమ బాధ్యతగా కన్న కూతురిని అల్లుడి చేతిలో పెట్టే శుభ గడియ ఓ మెమరబుల్ మూమెంట్. కాకపోతే ఇన్నాళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కూతురు పుట్టినింటి నుంచి మెట్టినింట అడుగుపెడుతుంటే ఆ తల్లిదండ్రులు పెట్టుకునే ఆనంద భాష్పాలను వర్ణించడానికి మాటలు చాలవు. ప్రస్తుతం అదే మూడ్‌లో ఉన్నారు మెగాబ్రదర్ నాగబాబు. ఈ మేరకు తాజాగా తన ఇన్స్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
Samayam Telugu నిహారిక వెళ్లిపోతోందిగా..! ఇక నా టైమ్‌పాస్ అంతా పీకూ తోనే..
Naga Babu


మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక వివాహం డిసెంబర్ 9వ తేదీన అంగరంగ వైభవంగా జరగనుంది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యను అత్యంత సన్నిహితుల సమక్షంలో రాజస్థాన్ లోని ఉద‌య్‌పూర్ ప్యాలెస్‌లో పెళ్లాడనుంది నిహారిక. వారం ముందునుంచే నాగబాబు ఇంట పెళ్లి సంబరాలు షురూ అయ్యాయి. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే నిహారికను పెళ్లికూతురు చేసేశారు.

ఈ నేపథ్యంలో నాగబాబు తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో ఆ పోస్ట్ వైరల్ అయింది. ఇంట్లో నిహారిక లేని లోటును నాగబాబు తన పెంపుడు కుక్క పీకూతో తీర్చుకోబోతున్నట్లు హింట్ ఇచ్చారు నాగబాబు. ఈ మేరకు 'ఇకపై పీకూ నా తలగడ' అంటూ భావోద్వేగ గపూరిత కామెంట్ చేస్తూ పీకూతో దిగిన పిక్ షేర్ చేశారు.

Also Read: Sri Reddy: ఆ కంపు నోరుతో మాట్లాడకు నాయనా.. నీ చరిత్ర తెలియదా? బండ్ల గణేష్‌, నాగబాబు పరువు గోవిందా!

మరోవైపు పెళ్లి కూతురు నిహారిక ఎప్పటికప్పుడు తన మ్యారేజ్ సెలబ్రేషన్స్ తాలూకు ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది. ముఖ్యంగా చిరంజీవి కూతుళ్లు శ్రీజ, సుస్మిత ఈ వేడుకలో తెగ సందడి చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9వ తేదీన జరగనున్న నిహారిక పెళ్లి వేడుక మెగా లోకానికి కన్నుల పండగగా మారనుంది అని చెప్పుకోవడంతో అతిశయోక్తి లేదు.
View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela)
View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7)
View this post on Instagram A post shared by Sreeja (@sreeja_kalyan)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.