క్లాస్ అయినా, మాస్ అయినా.. భక్తి సినిమా అయినా, రొమాంటిక్ సినిమా అయినా, ఎలాంటి సినిమా అయినా, ఎలాంటి పాత్ర అయిన రక్తి కట్టించే గ్రేట్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున. 56 ఏళ్లు మీద పడినా ఇప్పటికీ సోగ్గాడే. సీనియర్ హీరో అయినప్పటికీ తన స్టార్ డమ్ ను పక్కనపెట్టి కొత్తకొత్త డైరెక్టర్లకు ఛాన్సులు ఇస్తూ కొత్తకొత్త ప్రయోగాలు చేసే హీరో తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున ఒక్కడే అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఒక్క నటుడిగానే కాదు, నిర్మాతగా, టీవీ ప్రెజెంటర్ గా, అంతకుమించి మంచి వ్యాపారవేత్తగా అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్, టీవీ ఛానల్స్ ఇలా ఎన్నో రకాల బిజినెస్ లు సక్సెస్ ఫుల్ గా చేసి కంప్లీట్ మ్యాన్ అనిపించుకున్నారు నాగార్జున. తన కెరియర్లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాల్లో నటించారు నాగార్జున. అయితే నాగ్ కొత్త దర్శకులకు ఛాన్స్ ఇచ్చి వారితో సూపర్ హిట్స్ కొట్టిన సినిమాలేంటో ఒకసారి తెలుసుకుందాం.
శివ
సెన్సేషనల్ డైరెక్టర్ గా చెప్పుకునే రాంగోపాల్ వర్మను డైరెక్టర్ గా పరిచయం చేసింది నాగార్జునానే. నాగార్జున, అమల జంటగా 1989లో వచ్చిన 'శివ' సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. ఇది హిందీలో కూడా రీమేక్ అయింది.
నిన్నే ప్రేమిస్తా
నాగార్జున, సౌందర్య జంటగా 2000లో ఆర్. ఆర్ షిండే దర్శకుడిగా ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాకు కథ- స్క్రీన్ ప్లే అందించింది ప్రస్తుతం టాప్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్.
నువ్వు వస్తావని
నాగార్జున, సిమ్రన్ జంటగా 2000లో వీ. ఆర్ ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది.
సంతోషం
నాగార్జున, శ్రియ, గ్రేసీ సింగ్, ప్రభుదేవా ప్రధాన పాత్రలుగా దశరథ్ దర్శకత్వంలో 2002లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్. దశరథ్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ దర్శకుల్లో ఒకరు.
మాస్
కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ను దర్శకునిగా పరిచయం చేస్తూ నాగార్జున, జ్యోతిక, చార్మీ ప్రధాన పాత్రలుగా 2004లో వచ్చిన ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్.
సోగ్గాడే చిన్ని నాయనా
నాగార్జున డ్యుఎల్ రోల్ లో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 2016లో వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది ఆరంభంలోనే హిట్ సినిమాగా నిలిచింది.