యాప్నగరం

అదిరిపోయేలా నాగార్జున న్యూ లుక్

మాస్ పాత్ర అయినా, క్లాస్ పాత్ర అయినా... నాగార్జున లుక్ అందుకు తగ్గట్టు ఇట్టే మారిపోతుంది.

TNN 24 Jun 2016, 11:21 am
మాస్ పాత్ర అయినా, క్లాస్ పాత్ర అయినా... నాగార్జున లుక్ అందుకు తగ్గట్టు ఇట్టే మారిపోతుంది. గ్రీకువీరుడులో పిల్లిగెడ్డంతో, శ్రీరామదాసులో పొడవాటి జుట్టుతో, సోగ్గాడే... లో నిజంగా సోగ్గాడిలాగే... రకరకాల గెటప్ లు వేసుకుని ప్రేక్షకులను అలరిస్తున్నాడు నాగార్జున. ఈ ఏడాది సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి సినిమాలతో సూపర్ విజయాలను అందుకున్నాడు. ప్రస్తుం నిర్మల కాన్వెంట్లో ఓ డిఫరెంట్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఆయన లుక్ కూడా చాలా కొత్తగా ఉంది. మోకాలి వరకు మడతపెట్టిన ప్యాంటు, టోపీ, గెడ్డం, చేతిలో గిటార్ తో ఆయన న్యూలుక్ నిజంగా అదిరింది. శ్రీకాంత్ తనయుడు హీరోగా నిర్మల కాన్వెంట్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు నాగార్జునే నిర్మాత కూడా.
Samayam Telugu nagarjuna new look
అదిరిపోయేలా నాగార్జున న్యూ లుక్


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.