ఫుల్ పాజిటివ్ బజ్ తో రాబోతున్న సినిమా ‘హలో’. నాగార్జున తనయుడు అఖిల్ తొలి సినిమా డిజాస్టర్ గా నిలిచినా.. ఈ సినిమాపై మాత్రం పాజిటివ్ అంచనాలున్నాయి. దీనికి ప్రధాన కారణాల్లో దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ముందుంటాడు. ‘మనం’ వంటి క్లాసిక్‌ను రూపొందించిన అనంతరం 24 వంటి సూపర్ హిట్ ను ఇచ్చిన ఈ దర్శకుడు అక్కినేని వారి చిన్నబ్బాయికి కూడా సంచలన విజయాన్ని ఇవ్వగలడనే అంచనాల మధ్యన ఈ సినిమా రాబోతోంది. మరి అందుకు తగ్గట్టుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో మంచి నంబర్లను రీచ్ అవుతోంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 40 కోట్ల రూపాయల పైనే అనే వార్తలు కూడా ఇది వరకే వచ్చాయి. మరి ఇలాంటి నేపథ్యంలో కూడా ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన నాగార్జునకు చిన్న ఝలక్ తగిలిందని అనే టాక్ వినిపిస్తోందిప్పుడు. ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఈ సినిమా విషయంలో నాగ్ చిన్న పొరపాటు చేయడంతో ఇప్పుడు కొంత తేడా వచ్చేసిందని సమాచారం.
ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ విషయంలో ఇదంతా జరిగిందట. వాస్తవానికి ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ మొదట్లో ఐదు కోట్ల రూపాయల వరకూ పలికాయి. అయితే ఆ సమయంలో నాగ్ ఆరు కోట్ల రూపాయలకు గానీ ఈ సినిమా విడుదల హక్కులను ఇచ్చేది లేదని స్పష్టం చేశాడని సమాచారం. మరో బేరం లేదని కూడా నాగ్ స్పష్టం చేశాడట. అయితే.. ఇప్పుడు కథ అడ్డం తిరిగింది.
ఇటీవల తెలుగు సినిమాలు ఓవర్సీస్ లో విజయాలను నమోదు చేయడం లేదు. దసరా సీజన్ నుంచి ఇప్పటి వరకూ చూసుకుంటే.. అటు భారీ సినిమాలు, ఇటు చిన్న సినిమాలు విదేశాల్లో కళ్లు తేలేస్తున్నాయి. భారీ ధరలకు రైట్స్ కొన్న పంపిణీదారులు చేతులు కాల్చుకున్నారు. ఇలా ఓవర్సీస్ మార్కెట్ పూర్తిగా డల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘హలో’పై ఐదు కోట్ల రూపాయలను పెట్టడానికి కూడా డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడం లేదట.
రెండు, రెండున్నర కోట్లకు ఇస్తారా? అని అడుగుతున్నారట. అక్కడ బిజినెస్ బాగోలేకపోవడంతో ఈ నంబర్లు పలుకుతున్నాయట. దీంతో నాగ్ కు చిర్రెత్తుకొస్తోందని సమాచారం. తగ్గించి అడిగితే కాదు.. అని తనయుడి సినిమాను ఓవర్సీస్ లో సొంతంగా విడుదల చేయడానికి నాగ్ రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.