యాప్నగరం

ఆదిని చుట్టుముట్టేసిన అమ్మాయిల.. నాక్ నాక్ నాకొద్దు!

‘బుర్రకథ’ సినిమాలోని తొలిపాటను తాజాగా విడుదల చేశారు. ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన ఒక డీజే సాంగ్‌ను ఈ పాట తలపిస్తోంది. ‘నాక్ నాక్ నాకొద్దు’ అంటూ సాగే ఈ పాటను డైమండ్ రత్నబాబు రచించారు.

Samayam Telugu 23 Jun 2019, 3:14 pm
డైలాగ్ కింగ్, నటుడు సాయికుమార్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఆయన తనయుడు ఆది హీరోగా పరిచయమై చాలా కాలమే అవుతుంది. కానీ, ఆయన మార్కెట్‌ను క్రియేట్ చేయలేకపోతున్నారు. నటుడిగా మంచి గుర్తింపు వచ్చినా హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోతున్నారు. వరసపెట్టి సినిమాలు చేసుకొచ్చినా అవన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించడంలో విఫలమయ్యాయి. దీంతో కథల ఎంపికలో ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ‘బుర్రకథ’ అనే స్క్రిప్టును అంగీకరించారు. కిందటేడాది ఆగస్టులో ఈ సినిమా ప్రారంభమైంది.
Samayam Telugu Aadi


దీపాల ఆర్ట్స్ పతాకంపై హెచ్‌కె శ్రీకాంత్ దీపాల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సాయి కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆది సరసన మిష్తి చక్రవర్తి, నైరా షా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, అభిమన్యు సింగ్, జబర్దస్త్ మహేష్, ప్రభాస్ శ్రీను, ఫిష్ వెంకట్, గాయత్రి గుప్తా, జోష్ రవి తదితరులు నటిస్తున్నారు.

ఈ సినిమాలోని తొలిపాటను తాజాగా విడుదల చేశారు. ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన ఒక డీజే సాంగ్‌ను ఈ పాట తలపిస్తోంది. ‘నాక్ నాక్ నాకొద్దు’ అంటూ సాగే ఈ పాటను డైమండ్ రత్నబాబు రచించారు. సాయి కార్తీక్, కావ్య ఆలపించారు. ఈ పాటలో కొంత మంది అమ్మాయిలు కలిసి ఆదిని టీజ్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. వాళ్లు అడిగే రొమాంటిక్ కోరికలను ఆది ‘నాక్ నాక్ నాకొద్దు’ అంటున్నారు. పాట అంత గొప్పగా ఏమీ లేకపోయినా యూత్‌ను ఆకట్టుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.