యాప్నగరం

కొన్ని థియేటర్లలో కనిపించని నక్షత్రం సినిమా

ఏడాది కాలంగా సెట్స్‌పై వుంటూ, ఎన్నో అడ్డంకులు, ఆర్థిక అవరోదాలు దాటుకుని ఇవాళే రిలీజైన నక్షత్రం సినిమా కొన్ని థియేటర్లలో...

TNN 4 Aug 2017, 8:47 pm
ఏడాది కాలంగా సెట్స్‌పై వుంటూ, ఎన్నో అడ్డంకులు, ఆర్థిక అవరోదాలు దాటుకుని ఇవాళే రిలీజైన నక్షత్రం సినిమా కొన్ని థియేటర్లలో అసలు కనిపించనేలేదు. అమెరికాలో కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు రద్దు కాగా ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని థియేటర్లలో చివరి నిమిషంలో మార్నింగ్ షోలు రద్దయ్యాయి. ఇంకొన్ని చోట్ల ఇవాళ సాయంత్రం షోల నుంచే నక్షత్రం సినిమా ప్లే అవనుంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన సినిమా కావడంతో నక్షత్రం సినిమాకు టికెట్స్ తీసుకుని థియేటర్లకి పరుగులు తీసిన ఆడియెన్స్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
Samayam Telugu nakshatram shows cancelled in some theatres
కొన్ని థియేటర్లలో కనిపించని నక్షత్రం సినిమా


ఇదిలావుంటే, ఉన్నట్టుండి అకస్మాత్తుగా నక్షత్రం సినిమా షోలు రద్దు అవడానికి గల కారణాలు ఏంటనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్, రెజినా క్యాసండ్రా, ప్రగ్యా జైశ్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి రిలీజైన థియేటర్లలో మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.