యాప్నగరం

​‘బిగ్‌బాస్’లో లక్ పరీక్షించుకుంటున్న అందాల భామ!

ఇప్పటికే హిందీ, కన్నడ భాషల్లో సక్సెస్ అయిన టీవీ షో ‘బిగ్‌బాస్’ తెలుగు

TNN 27 Jun 2017, 2:41 pm
ఇప్పటికే హిందీ, కన్నడ భాషల్లో సక్సెస్ అయిన టీవీ షో ‘బిగ్‌బాస్’ తెలుగు భాషలో కూడా అతిత్వరలో ప్రారంభం కానుంది. తెలుగులో ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే. అయితే తెలుగు కన్నా ముందు ఈ షో తమిళంలో ఆరంభం అయ్యింది. కమల్ హాసన్ హోస్టుగా వ్యవహరిస్తున్నారక్కడ. మరి కమల్ ఆధ్వర్యంలోని బిగ్‌బాస్ హౌస్ లో ఎవరెవరు పాల్గొంటున్నారనే అంశంపై స్టార్ నెట్‌వర్క్ స్పష్టతనిచ్చింది.
Samayam Telugu namith in biggboss show
​‘బిగ్‌బాస్’లో లక్ పరీక్షించుకుంటున్న అందాల భామ!



అక్కడ ఈ షోలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది నమిత. తెలుగుతో మొదలుపెట్టి తమిళం వైపు వెళ్లి అక్కడ గ్లామరస్ భామగా సూపర్ సక్సెస్ ను సొంతం చేసుకుంది నమిత. తన భారీ అందాలతో తమిళులను అమితంగా ఆకట్టుకుంది. నమితకు ఆలయం కట్టేంత వరకూ వెళ్లింది వ్యవహారం. అయితే అక్కడ కూడా ఆమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి ఈ మధ్య. ఈ క్రమంలో నమిత బిగ్‌బాస్ లో పాల్గొంటుండటం గమనార్హం.

కమల్ హాసన్ హోస్టు చేసే ఈ కార్యక్రమంలో పెద్ద స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది నమిత మాత్రమే. ఈ కార్యక్రమంలోని మిగిలిన 14 మంది పోటీదారుల్లో తమిళ కమేడియన్లు ఇద్దరున్నారు. వారు కూడా మరీ అంత స్టార్లేమీ కాదు. ఇక పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన గాయత్రి రఘురాం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.