యాప్నగరం

సితారకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నమత్ర.. మురిసిపోయిన లిటిల్ ప్రిన్సెస్

సితార పుట్టినరోజు సందర్భంగా నమత్ర ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. తల్లి ఇచ్చిన సర్ ప్రైజ్ చూసి సితార ఆనందంతో తడిసి ముద్దయ్యింది.

Samayam Telugu 21 Jul 2020, 11:55 am
ిమహేష్ గారాల పట్టి సితార తాజాగా బర్త‌డే వేడుకలు జరుపుకుంది. జూలై 20న ఎనిమిదో వసంతంలోకి సితార అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సితారకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. లిటిల్ ప్రిన్స్ బర్త్‌డే సందర్బంగా అభిమానులు, సన్నిహితులు, పలువురు ప్రముఖులు సితారకు బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే తల్లి నమ్రతా .. పుట్టినరోజు సందర్భంగా సితారకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. తల్లి ఇచ్చిన సర్‌ప్రైజ్ చూసి సితార మురిసిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
Samayam Telugu తల్లి నమత్రతో సితార
namrata, sitara

Read More: నీ మంచి పనులు కొనసాగించు.. ఉపాసనపై రామ్ చరణ్ ప్రశంసలు
మరోవైపు సితార బర్త్ డే రోజునే రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టినరోజు కూడా. సో ఉపాసన కూడా సితారకు విషెస్ చెబుతూ ఓ ట్వీట్ చేసింది. సితార ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరింది. ఇక సితారకు తన యూట్యూబ్ పార్ట్నర్ , వంశీ పైడిపల్లి కూతురు ఆద్య కూడా సర్‌ప్రైజ్ ఇచ్చింది. సితార, ఆద్య ఎ అండ్ ఎస్ పేరుతో కొద్ది రోజుల క్రితం యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయగా, దీనికి మంచి స్పందన వస్తుంది.

అయితే కరోనా కారణంగా ప్రముఖులంతా తమ పుట్టినరోజు వేడుకల్ని రద్దు చేసుకున్నారు. ఎవరూ ఎలాంటి సెలబ్రేషన్స్ జరుపుకోలేదు. అటు ఫ్యాన్స్‌ను కూడా అదే కోరారు. ఎలాంటి వేడుకలు వద్దని.. ఇంట్లో ఉండి అంతా క్షేమంగా ఉండాలని పిలుపునిచ్చారు.
View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) on Jul 20, 2020 at 3:38am PDT

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.