యాప్నగరం

వాళ్లను కాపాడటానికి రక్తదానం ఒక్కటే పరిష్కారం : బాలకృష్ణ

తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం అందరూ రక్తదానం చేయాలని నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన అందరూ రక్తదానం చేయాలన్నారు.

Samayam Telugu 30 Sep 2020, 10:44 pm
వైద్య రంగం ఎంతగా అభివృద్ధి చెందినా కృత్రిమంగా రక్తం తయారు చేయడం కుదరదని అన్నారు హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. అందువల్లే అందరూ రక్తదానం చేయాలని సూచించారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ వీడియోను ఆయన విడుదల చేశారు.
Samayam Telugu నందమూరి బాలకృష్ణ


Also Read: ఆ ఘనతకు 21ఏళ్లు.. జ్ఞాపకాల్లో మునిగి తేలుతున్న త్రిష
ప్రస్తుతం దేశంలో సంవత్సరానికి 10-12వేల మంది తలసేమియా వ్యాధితో జన్మిస్తున్నారని, వారికి రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు. వీరి కోసం కృత్రిమ రక్తాన్ని తయారు చేయలేం కాబట్టి.. రక్తదానం ఒక్కటే పరిష్కారమని తెలిపారు. ఎదుటివారికి రక్తదానం, ప్లాస్మా దానం చేయడం వల్ల మనకెలాంటి దుష్పరిణామాలు ఉండవని చెప్పారు.

Also Read: బెడ్రూమ్ సీన్స్ ఆఫర్లే ఎక్కువగా వస్తున్నాయి: ఆండ్రియా
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తలసేమియా బాధితుల కోసం తెలంగాణా తెలుగు యువత, ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్టు బాలకృష్ణ తెలిపారు. నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.

Also Read: వ్యభిచారం కోసం వాట్సాప్ గ్రూపు.. మరిన్ని చిక్కుల్లో రాగిణి, సంజనా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.