టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మూస పంథాలో సినిమాలు చేయటానికి ఆసక్తి చూపించరు. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో మెప్పించే ప్రయత్నం చేస్తుంటారు. సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాలు చేసి అభిమానులను మెప్పించారు. మాస్ పాత్రలతో మెప్పించటమే కాదండోయ్.. ఎక్స్పెరిమెంటల్ రోల్స్‌తోనూ అలరించటం ఆయనకే చెల్లింది. తాజాగా మీడియాలో వినిపిస్తోన్న వార్తల మేరకు నందమూరి బాలకృష్ణ త్వరలోనే ఓ ఎక్స్పెరిమెంట్ రోల్లో కనిపించబోతున్నారట. ఇంతకీ ఏంటా రోల్ అనే ఎగ్జయిట్మెంట్ రాక మానదు. విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన తత్వవేత్త, యోగి అయిన రామానుచార్యుడు (Ramanujacharya) పాత్రలో నందమూరి కథానాయకుడు కనిపించబోతున్నారట.
బాలకృష్ణతో ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ కలిసి ఈ సినిమాను రూపొందించనుంది. వేద గురువు, ఉప దేశకుడు, శ్రీవైష్ణవ ప్రముఖుడైన చిన్న జీయర్ స్వామి (Chinna Jeeyar Swamy) ఈ సినిమాను రూపకల్పన చేయటంలో తన వంతు సహకారాన్ని అందిస్తున్నారనేది సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ప్రయోగాత్మక పాత్రలు చేయటానికి ఎప్పుడూ ఆసక్తి చూపే హీరోగా పేరున్న బాలకృష్ణ రామానుజాచార్యుడి పాత్రలో కనిపించటానికి ఆసక్తి చూపుతారనంటంలో సందేహం లేదు. మరి సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు? కథ ఎలా ఉండబోతుంది.. ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ హౌస్ అంటున్నారు కాబట్టి.. సినిమా రిలీజ్‌ను ఎలా ప్లాన్ చేస్తారనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
మూవీ మేకింగ్‌లో టాలీవుడ్ పంథా మారింది. స్టార్ హీరోలు, కొత్తగా సినీ పరిశ్రమలోకి వస్తున్న యంగ్ హీరోలు ఎక్స్పెరిమెంట్స్ రోల్స్ చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే రామానుజాచార్యులు సినిమా రూపొందించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి (Veera Simha Reddy) సినిమాలో నటించారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇప్పుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో NBK 108 సినిమా స్టార్ట్ చేశారు.

- Read Tollywood Updates & Telugu News