యాప్నగరం

కల్యాణ్‌రామ్ 15వ చిత్రం.. క్లాప్ కొట్టిన ఎన్టీఆర్

నందమూరి కల్యాణ్‌రామ్ కొత్త సినిమా షూటింగ్ ఆదివారం ఉదయం రామానాయుడు స్టూడియోస్‌లో లాంఛనంగా ప్రారంభమైంది.

TNN 30 Jul 2017, 12:01 pm
నందమూరి కల్యాణ్‌రామ్ కొత్త సినిమా షూటింగ్ ఆదివారం ఉదయం రామానాయుడు స్టూడియోస్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఇది కల్యాణ్‌రామ్ 15వ సినిమా కావడం విశేషం. పూజా కార్యక్రమాల అనంతరం తొలి షాట్‌కు కల్యాణ్‌రామ్ తమ్ముడు ఎన్టీఆర్ క్లాప్ కొట్టారు. నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సిద్ధార్థ హీరోగా వచ్చిన ‘180’ సినిమాకు దర్శకత్వం వహించిన జయేంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ సమర్పణలో కూల్ బ్రిజీ సినిమాస్ ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తోంది.
Samayam Telugu nandamuri kalyan rams 15th movie begins shooting
కల్యాణ్‌రామ్ 15వ చిత్రం.. క్లాప్ కొట్టిన ఎన్టీఆర్


ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి. శ్రీరామ్ ఈ సినిమాకు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. మలయాళ నటి ఐశ్వర్య.. కల్యాణ్‌రామ్ సరసన నటిస్తోంది. కాగా, సినిమా షూటింగ్ ప్రారంభ వేడుకకు నందమూరి హరికృష్ణ, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, డైరెక్టర్ క్రిష్ హాజరయ్యారు. ప్రస్తుతం కల్యాణ్‌రామ్ ‘ఎంఎల్ఏ - మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి’ చిత్రంలో నటిస్తు్న్నారు. అలాగే ఎన్టీఆర్‌తో ‘జైలవకుశ’ సినిమాను నిర్మిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.