యాప్నగరం

Mokshagna: బాలయ్యపై తీవ్ర విమర్శలు.. కుక్కలు మొరుగుతున్నాయంటూ మోక్షజ్ఞ కౌంటర్

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ (NTR Health University) పేరు మార్పుపై ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) తీవ్రస్థాయిలో మండిపడిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ నేతలు బాలయ్యపై విమర్శలు చేస్తున్నారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 25 Sep 2022, 5:43 pm
ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ (NTR Health University) పేరు మార్పుపై తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీ (YSR Health University)గా పేరు మార్చడంతో రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, ఎన్టీఆర్ అభిమానులు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నందమూరి హీరోలు కూడా స్పందించారు. నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నారా రోహిత్ సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై తమ గళం వినిపించారు.
Samayam Telugu nandamuri mokshagna
నందమూరి మోక్షజ్ఞ


బాలకృష్ణ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేతలు మూకుమ్మడి దాడి చేస్తున్నారు. మంత్రుల నుంచి కిందిస్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరు బాలయ్యను టార్గెట్‌ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. తన తండ్రిపై వస్తున్న విమర్శలకు నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. వాళ్లు ఎంత చేసినా బాలయ్య వెంట్రుక కూడా పీక్కోలేరంటూ ఫైర్ అయ్యాడు.

'బాలయ్య మీద గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మొరుగుతున్న కొన్ని కుక్కలకు.. మీరు ఎంత చేసిన బాలయ్య వెంట్రుక కూడా పీక్కోలేరు.. అవసరం ఉన్నప్పుడు అందరూ ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చినవారే.. అవసరం తీరిపోయాక కారు కూతలు కూస్తే కాలమే సమాధానం చెప్తుంది..' అంటూ మోక్షజ్ఞ ట్వీట్ చేశాడు.


'మార్చేయడానికి తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదు.. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక.. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు.. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు.. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త.. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్.. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..' అంటూ బాలయ్య తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.