యాప్నగరం

ప్రభుత్వం కొంత తప్పు చేసింది.. అశ్వనీదత్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై రగడ ఇంకా కొనసాగుతోంది. అవార్డుల్లో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని, వాళ్లను తొక్కేస్తున్నారని విమర్శించిన వారూ ఉన్నారు.

Samayam Telugu 19 Nov 2017, 10:57 am
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై రగడ ఇంకా కొనసాగుతోంది. అవార్డుల్లో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని, వాళ్లను తొక్కేస్తున్నారని విమర్శించిన వారూ ఉన్నారు. తమ సినిమాలకు అవార్డులు దక్కలేదని మరి కొందరు బాహటంగానే విమర్శిస్తున్నారు. గత వారం రోజులుగా మీడియాలో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా లెజెండ్ సినిమాకు తొమ్మిది నంది అవార్డులు రావడంపైనే అందరూ తీవ్రవ విమర్శలు చేస్తున్నారు.
Samayam Telugu nandi awards producer ashwini dutt respond about awards
ప్రభుత్వం కొంత తప్పు చేసింది.. అశ్వనీదత్


దీనిపై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ స్పందించారు. మూడు సంవత్సరాలకు సంబంధించిన నంది అవార్డులను ఒకేసారి ప్రకటించడంతోనే వివాదం ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. నంది అవార్డులపై వివాదం చెలరేగిన నేపథ్యంలో స్పందించిన ఆయన, అసలు అవార్డులే ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ విమర్శించడం లేదని వ్యాఖ్యానించారు. జ్యూరీ సభ్యుల ఎంపికలో ప్రభుత్వం చిన్న తప్పులు చేసిందని, వారిని ఎంపిక చేసే ముందు ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందని అశ్వనీదత్ అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి చిత్రం 'మనం'కు అవార్డు ఇచ్చివుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇకపై క్రమం తప్పకుండా ఏటా అవార్డులను అందజేయాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.