యాప్నగరం

‘ఎంసీఏ’ సెన్సార్ రిపోర్ట్: హిట్ కొడతాడట!

నేచురల్ స్టార్ నాని, ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘ఎంసీఏ-మిడిల్ క్లాస్ అబ్బాయ్’ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేసింది.

TNN 15 Dec 2017, 3:59 pm
నేచురల్ స్టార్ నాని, ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘ఎంసీఏ-మిడిల్ క్లాస్ అబ్బాయ్’ డిసెంబర్ 21న భారీ విడుదలకు రెడీ కావడంతో ప్రస్తుతం ప్రమోషన్స్ వర్క్స్‌లో బిజీగా ఉంది. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన ఈ చిత్రం సెన్సార్‌ను కంప్లీట్ చేసుకుని యు/ఏ సర్టిఫికేట్‌ను పొందింది.
Samayam Telugu nani and sai pallavi starrer mca movie completed censor formalities
‘ఎంసీఏ’ సెన్సార్ రిపోర్ట్: హిట్ కొడతాడట!


రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన రెండు సాంగ్స్ ఇప్పటికే విడుదలై అద్భుత‌మైన రెస్పాన్స్‌ను రాబట్టాయి. మిగిలిన సాంగ్స్‌ను డిసెంబ‌ర్ 16న (రేపు) వ‌రంగ‌ల్‌ హన్మకొండలో జరిగే ప్రీ రిలీజ్ వేడుకలో అభిమానుల స‌మ‌క్షంలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. కాగా ఈ మూవీపై రిజల్ట్‌పై ధీమా వ్యక్తం చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. సెన్సార్ సభ్యుల నుండి పాటిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చిత్ర విశేషాలను తెలియజేశారు.

మా ‘ఎంసీఏ’ సినిమాను డిసెంబ‌ర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. నిజానికి డిసెంబ‌ర్ 15న విడుద‌ల చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ కుద‌ర‌లేదు. ఈ సినిమాను డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌నుకోవ‌డానికి కార‌ణం.. ఇప్ప‌టికే మా బ్యాన‌ర్‌లో ఐదు సినిమాలు హిట్స్ వ‌చ్చాయి. అన్ని కుదిరితే ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ సాధించాల‌ని అనుకున్నాం. ఖచ్చితంగా ‘ఎంసీఏ- మిడిల్ క్లాస్ అబ్బాయ్’ హిట్ కొడతాడనే నమ్మకం ఉందన్నారు దిల్ రాజు.

#MCA completed censor formalities with UA certification and no cuts. Grand release on December 21st. #MCAonDec21st pic.twitter.com/eq5kbmBnxE — S V C (@SVC_official) December 15, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.