యాప్నగరం

అన్ని సినిమాల యందు ‘అ!’ సెన్సార్ రిపోర్ట్ వేరయా!

అన్ని సినిమాలయందు ‘అ!’ సినిమా వేరయా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది నాని ‘అ!’.

TNN 9 Feb 2018, 9:31 pm
అన్ని సినిమాలయందు ‘అ!’ సినిమా వేరయా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది నాని ‘అ!’. ‘మిడిల్ క్లాస్ అబ్బాయ్’ చిత్రంతో తాజా హిట్ అందుకున్న నాని నిర్మాతగా మారి వాల్ పోస్ట‌ర్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘అ!’. ప్రస్తుతం షూటింగ్ అనంతర కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ మూవీ సెన్సార్ ఫార్మాల్టీస్‌ను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల నుండి ‘అ !’ మూవీకి యు/ఏ సర్టిఫికేట్ లభించింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాని (చేపగా), రవితేజ (చెట్టుగా) సొంత వాయిస్ ఓవర్‌తో కనిపించనున్నారు.
Samayam Telugu nani awe telugu movie censor completed
అన్ని సినిమాల యందు ‘అ!’ సెన్సార్ రిపోర్ట్ వేరయా!


ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘అ!’ మూవీకి యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తొమ్మిది పాత్రల చుట్టూ తిరిగే ఈ చిత్రంలో నిత్యామేనన్‌, కాజల్‌, శ్రీనివాస్‌ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.