యాప్నగరం

నటరాజు నాని అక్కగా.. అందాల భామ

నాచురల్ స్టార్ నాని తదుపరి సినిమాలో ఒకనాటి అందాల నటి తన అక్క పాత్రను పోషించనుందని సమాచారం.

TNN 8 Feb 2017, 2:28 pm
టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న యువ హీరో నాని ఒక సినిమా చేస్తుండగానే.. మరో సినిమాకి సంతకాలు చేసేస్తూ వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. తాజాగా దిల్ రాజు బ్యానర్లో అతడు నటించిన నేను లోకల్ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించగలిగింది. దీంతో దిల్ రాజు మరో సినిమాను కూడా నానితో చేయాలని భావిస్తున్నాడని.. దానికి నటరాజ్ అనే పేరును కూడా రిజిస్టర్ చేసినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కీలకమైన నాని అక్క పాత్ర కోసం భూమికను సంప్రదించగా.. ఆమె ఓకే చెప్పిందట.
Samayam Telugu nani next movie bhoomika will act as his sister
నటరాజు నాని అక్కగా.. అందాల భామ


గత ఏడాది వచ్చిన ఎం.ఎస్.ధోని సినిమాలో ధోనీ ప్రాతధారికి అక్క పాత్రలో మెప్పించిన భూమిక తొలుత ఈ సినిమాలో చేసేందుకు నిరాకరించినా.. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో చివరికి ఒప్పుకొందని సమాచారం. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. పెళ్లి తర్వాత టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్న భూమిక.. రీ ఎంట్రీతో ఎలా మెప్పిస్తుందో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.