యాప్నగరం

ఎంసీఏ పూర్తయ్యాకా నాని ఏం చేయనున్నాడో తెలుసా ?

జులై 7న 'నిన్ను కోరి' సినిమాతో ఆడియెన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్న నాని ప్రస్తుతం ఎంసీఏ చేస్తున్నాడు..

Samayam Telugu 12 Jun 2017, 5:12 pm
జులై 7న 'నిన్ను కోరి' సినిమాతో ఆడియెన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్న నాని ప్రస్తుతం ఎంసీఏ చేస్తున్నాడు. ఎంసీఏ అంటూ అదేదో మాస్టర్స్ డిగ్రీ అనుకోకండి.. అది దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో నాని చేస్తున్న కొత్త సినిమా టైటిల్. ఈ ఎంసీఏ సినిమా కూడా పూర్తి కాగానే మరో యంగ్ డైరెక్టర్‌తో సినిమా చేయనున్నాడట నాని. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాతో రెండు హిట్స్ అందుకున్న మేర్లపాక గాంధీ ముచ్చటగా మూడోసారి కూడా హిట్ అందుకునేందుకు నానిని డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
Samayam Telugu nani to team up with merlapaka gandhi
ఎంసీఏ పూర్తయ్యాకా నాని ఏం చేయనున్నాడో తెలుసా ?


మేర్లపాక గాంధీ-నాని కాంబినేషన్‌లో రాబోయే సినిమా ఏంటి ? నేపథ్యం ఏంటి ? నిర్మాత ఎవరు ? ఇతర నటీనటులు ఎవరనే విషయాలన్నీ త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. జులైలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్. ఈ సినిమాతో మేర్లపాక హిట్ కొట్టగలిగితే అది అతడికి హ్యాట్రిక్ హిట్ అవుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.