యాప్నగరం

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ కొత్త సినిమా టీజర్

న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా సందీప్ కిషన్ నటించిన అప్‌కమింగ్ మూవీ c/0 సూర్య సినిమా టీజర్ విడుదలైంది.

TNN 25 Sep 2017, 6:07 pm
Samayam Telugu o suryas teaser
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ కొత్త సినిమా టీజర్
న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా సందీప్ కిషన్ నటించిన అప్‌కమింగ్ మూవీ c/0 సూర్య సినిమా టీజర్ విడుదలైంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుశీంథిరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కింది. తమిళంలో 'నెన్జిల్ తునివిరుంధల్' అనే టైటిల్‌తో రిలీజ్ కానున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన మెహ్రీన్ పిర్జాద జంటగా నటించింది. ఈ టీజర్‌తో సినిమాలో సందీప్ కిషన్ క్యారెక్టర్, అతడి లైఫ్ స్టైల్‌తోపాటు చుట్టూ వున్న పాత్రల గురించి ఒక్క ముక్కలో ఎలా చెప్పాలో అలా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు సుశీంథిరన్. సందీప్ కిషన్‌కి స్నేహితుడి పాత్రలో తెలుగు కమెడియన్ సత్య నటించాడు.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'c/o సూర్య'పై అంచనాలు భారీగానే వున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.