యాప్నగరం

‘కృష్ణార్జున యుద్ధం’ తొలిపాట.. దారిచూడు మామ!

నేచురల్ స్టార్ నాని రెండు విభిన్న పాత్రల్లో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాడు. ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’.

TNN 16 Jan 2018, 1:29 pm
నేచురల్ స్టార్ నాని రెండు విభిన్న పాత్రల్లో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాడు. ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. ఇప్పటికే కృష్ణ, అర్జున పాత్రలను పరిచయం చేశారు. నేడు (జనవరి 16న) తొలి పాటను విడుదల చేసారు. ‘దారి చూడు దుమ్ము చూడు మామ’ అంటూ సాగిన పూర్తి లిరికల్ సాంగ్‌ను యూట్యూబ్‌లో పెట్టారు. ఈ పాట పూర్తిగా తమిళ ఫ్లేవర్‌లో ఉంది. ఊర మాస్ బాణీతో సాగిపోయింది. ఇప్పటి వరకు కైలాస్ ఖేర్ వైవిధ్యమైన స్వరాన్ని ఎంజాయ్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడు మరో అద్భుతమైన స్వరం పరిచయమైంది. ఆయనే పెంచల్ దాస్. ఈ పాట రచించి, ఆయనే పాడారు.
Samayam Telugu nanis krishnarjuna yuddham dhaari choodu full song with lyrics
‘కృష్ణార్జున యుద్ధం’ తొలిపాట.. దారిచూడు మామ!


ఈ పాటకు ఆయన స్వరమే హైలైట్. మాస్ ఆడియన్స్‌కు పండగ లాంటి పాట. నాని హావభావాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఊర మాస్ క్యారెక్టర్లు ఆయన చేసేశాడు. ఇప్పుడు మరోసారి తనలోని మాస్‌ను ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. ఈ పాట వీడియోలో కనిపిస్తున్న నాని హావభావాలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోవాల్సిందే. ‘ధృవ’ ఫేం హిప్‌హాప్ తమిళ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి సంక్రాంతి పండగ సందర్భంగా పరిచయం చేసిన ‘కృష్టార్జున యుద్ధం’ ఫస్ట్ లుక్స్, తొలి పాట ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.