నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రం 'నేను లోకల్'. త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా వెనక్కి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అసలు విషయంలోకి వస్తే రామ్ చరణ్ నటిస్తోన్న‘ధృవ’ సినిమా డిసంబర్ 9న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా చరణ్‌కు ఎంతో కీలకమైనది. భారీ కలెక్షన్స్ రాబట్టడానికి చరణ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తన సినిమాకు మరో సినిమా అడ్డు రాకుండా చూసుకుంటున్నాడు. ఇందులో భాగంగా డిసంబర్ 16న రావాల్సిన సింగం3 సినిమాను డిసంబర్ 23కి వాయిదా వేయించాడు. దీంతో డిసంబర్ 23న రావాలనుకున్న నాని సినిమా ఇప్పుడు ఆలోచనలో పడింది.
నానికి మాస్లో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట నిర్మాత దిల్ రాజు. మరో పక్క నాని సింగం3 తో పోటీకి దిగడం మంచిదా..? వాయిదా వేయడం మంచిదా..? అని ఆలోచిస్తున్నాడట. మరి ఫైనల్ గా సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!