యాప్నగరం

మంచు వారబ్బాయికి నారా వారబ్బాయ్ ‘మాట’ సాయం

మంచు మనోజ్ ఎల్‌.టి.టి.ఇ. ప్ర‌భాక‌ర‌న్‌గా చేస్తున్న ప్రయోగాత్మక చిత్రం 'ఒక్క‌డు మిగిలాడు'. అజయ్‌ అండ్రూస్‌ నూతక్కి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్‌ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

TNN 7 Nov 2017, 3:45 pm
మంచు మనోజ్ ఎల్‌.టి.టి.ఇ. ప్ర‌భాక‌ర‌న్‌గా చేస్తున్న ప్రయోగాత్మక చిత్రం 'ఒక్క‌డు మిగిలాడు'. అజయ్‌ అండ్రూస్‌ నూతక్కి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్‌ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. టైటిల్, టీజర్ అండ్ ట్రైలర్స్‌తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసిన ఈ మూవీకి సెన్సార్ బోర్డ్‌నుండి ప్రశంసలు దక్కడంతో ‘ఒక్కడు మిగిలాడు’ మూవీపై కాన్ఫిడెన్స్‌తో ఉంది చిత్ర యూనిట్. కాగా ఈ మూవీకి అదనపు హంగులు యాడ్ చేస్తున్నారు.
Samayam Telugu nara rohit voice over for okkadu migiladu
మంచు వారబ్బాయికి నారా వారబ్బాయ్ ‘మాట’ సాయం


శ్రీలంక శరణార్థుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. టైటిల్స్‌తోటే కథ ప్రారంభం కానుండటంతో ఈ టైటిల్స్ పడే సందర్భంలో వాయిస్ ఓవర్ కూడా ఉంటుంది. సో.. ఆ వాయిస్ ఓవర్‌ను నారా రోహిత్‌తో చెప్పిస్తూ మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు. తాజాగా నారా రోహిత్ ‘ఒక్కడు మిగిలాడు’ మూవీకి వాయిస్ ఓవర్ చెప్తూ ఉన్న ఫోటోను మంచు మనోజ్ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ఒక్కడు మిగిలాడు మూవీ టైటిల్స్‌కి టెర్రిఫిక్ వాయిస్ ఓవర్ అందించిన నా మిత్రుడు నారా రోహిత్‌కి స్పెషల్ థ్యాంక్స్ అంటూ కామెంట్ పెట్టాడు మంచువారబ్బాయి.

మంచు మనోజ్‌, అనీషా ఆంబ్రోస్‌, మిలింద్‌ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం వి.కోదండరామరాజు అందించగా శివనందిగామ సంగీతాన్ని సమకూర్చారు.

Terrific voice for the titles of #OkkaduMigiladu by my friend/cousin #NaraRohith ❤❤Love you! Thank you for adding up the intensity! ☺ pic.twitter.com/crUT0e1e0r — Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) November 7, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.