యాప్నగరం

‘బాలకృష్ణుడు’ సెన్సార్ రిపోర్ట్..

రొటీన్ కథలకు భిన్నంగా వైవిధ్యభరిత కథలను ఎన్నుకుంటూ తెలుగు హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు నారావారబ్బాయి రోహిత్.

TNN 22 Nov 2017, 2:04 pm
రొటీన్ కథలకు భిన్నంగా వైవిధ్యభరిత కథలను ఎన్నుకుంటూ తెలుగు హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు నారావారబ్బాయి రోహిత్. తాజాగా ఈ హీరో గ్లామర్ బ్యూటీ రెజీనాతో జతకట్టి 'బాలకృష్ణుడు' అనే క్యాచీ టైటిల్‌తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఫస్ట్‌లుక్, ట్రైలర్‌లతో మూవీపై అంచనాలు పెంచేసిన 'బాలకృష్ణుడు' విడుదలకు రెడీ కావడంతో ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.
Samayam Telugu nara rohith balakrishnudu gets censor clearance
‘బాలకృష్ణుడు’ సెన్సార్ రిపోర్ట్..


2.22 గంటల నిడివి ఉన్న ఈమూవీకి సెన్సార్ బోర్డ్ యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. మాయాబజార్ పిక్చర్స్‌లో బి.మహేంద్రబాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరిలు నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. రమ్యకృష్ణ ఈ మూవీలో కీలకపాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి మెలోడి మాంత్రికుడు మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా.. నవంబర్ 24న 'బాలకృష్ణుడు' థియేటర్స్‌లో సందడి చేయనున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.