యాప్నగరం

Naresh: న‌రేష్‌, ప‌విత్రా లోకేష్ ‘మళ్ళీ పెళ్లి’ టీజర్ వాయిదా.. నెటిజన్స్ రియాక్షన్

Malli Pelli Teaser: సీనియ‌ర్ న‌రేష్, ప‌విత్రా లోకేష్ ప్ర‌ధాన తారాగ‌ణంగా ఎం.ఎస్‌.రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం మ‌ళ్ళీ పెళ్లి. గురువారం ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లవుతుందని ప్ర‌క‌టించారు. కానీ చివ‌రి నిమిషంలో వాయిదా వేశారు

Authored byతుమ్మల మోహన్ | Samayam Telugu 13 Apr 2023, 12:46 pm
Naresh VK - Pavitra Lokesh - Malli Pelli: సీనియ‌ర్ న‌టుడు న‌రేష్, న‌టి ప‌విత్రా లోకేష్ క‌లిసి న‌టిస్తోన్న చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. వీరిద్దరూ కలిసి నటిస్తోన్న గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ఇది. విడుదలకు సన్నద్ధమవుతుంది. సీనియర్ దర్శక నిర్మాత ఎం.ఎస్.రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు. గురువారం ఈ మూవీ టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే చివ‌రి నిమిషంలో ప్ర‌య‌త్నాన్ని విర‌మిస్తున్న‌ట్లు తెలియ‌జేశారు. త్వ‌ర‌లోనే టీజ‌ర్ డేట్‌ను కూడా ప్ర‌క‌టిస్తామ‌ని వారు తెలిపారు. టీజ‌ర్‌ను వాయిదా వేయ‌టానికి కార‌ణం సాంకేతిక కార‌ణాలేన‌ని టీమ్ తెలియ‌జేసింది. అయితే దీనిపై నెటిజ‌న్స్ త‌మ‌దైన పంథాలో కామెంట్స్ రూపంలో రియాక్ట్ అవుతున్నారు.
Samayam Telugu Malli Pelli
Malli Pelli, మళ్ళీ పెళ్లి


మ‌ళ్ళీ పెళ్లి చిత్రంలో నరేష్‌, ప‌విత్రా లోకేష్‌ల‌తో పాటు జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఇత‌ర పాత్ర‌ల్లో వ‌నితా విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, అరుల్ దేవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేయ‌టానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

నిజ జీవితంలోనూ సీనియ‌ర్ న‌రేష్, ప‌విత్రా లోకేష్ లివ్ ఇన్ రిలేష‌న్ షిప్‌లో ఉన్నారు. తామిద్ద‌రం క‌లిసే ఉంటున్నామ‌ని న‌రేష్ బ‌హిరంగంగానే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో మ‌ళ్ళీ పెళ్లి సినిమాపై తెలియ‌ని క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. అస‌లు ఎం.ఎస్‌.రాజు ఈ చిత్రంలో ఎలాంటి కంటెంట్‌ను చూపించాల‌నుకుంటున్నారనేది ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి రిలీజ్ డేట్‌ను ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎప్పుడు ప్ర‌క‌టిస్తారో చూడాలి మ‌రి.

ALSO READ: Madhavi Latha: ఆరోజు నైట్‌కి వ‌స్తావా అని అడిగినాళ్లు..డిప్రెష‌న్‌తో చ‌చ్చిపోవాల‌నిపించింది: మాధ‌వీ ల‌త
ALSO READ: Jr NTR: ఎన్జీఆర్ గ్రాండ్ డిన్న‌ర్ పార్టీ.. అమెజాన్ వైస్ ప్రెసిడెంట్‌ వచ్చినా.. రామ్ చ‌ర‌ణ్‌, సుక్కు ఎందుకు రాలేదు?
ALSO READ: Akira Nandan: సైలెంట్‌గా అకీరా నందన్ ఎంట్రీ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌యుడికి హీరో కావాల‌ని లేదా!

Read latest Tollywood updates and Telugu News
రచయిత గురించి
తుమ్మల మోహన్
మోహ‌న్ కుమార్ తుమ్మ‌ల స‌మ‌యం తెలుగులో డిజిట‌ల్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఇక్కడ సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్, వార్తలను రాస్తుంటారు. మోహ‌న్ కుమార్‌కి సినీ జ‌ర్న‌లిజంలో 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. గ‌తంలో ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల్లో సినీ జ‌ర్న‌లిస్టుగా వ‌ర్క్ చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.