యాప్నగరం

వివాదంలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్: 65 మంది గ్రహీతలు గైర్హాజరు

ప్రతిష్టాత్మక జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవ వేడుకలపై వివాదం రేగింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నేడు (మే 3) 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి.

Samayam Telugu 3 May 2018, 7:08 pm
ప్రతిష్టాత్మక జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవ వేడుకలపై వివాదం రేగింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నేడు (మే 3) 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. దేశంలోని అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్ వారికి సంబంధించి ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి కేంద్రప్రభుత్వం ఈ అవార్డులను అందిస్తుంది. తాజాగా మొత్తం 140 మంది వివిధ కేటగిరీలలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అవార్డులకు ఎంపికయ్యారు.
Samayam Telugu నేషనల్ అవార్డ్స్ 2018


ఆనవాయితీ ప్రకారం విజేతలందరూ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను స్వీకరించాల్సి ఉంది. అయితే నేటి వేడుకలలో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ... కేవలం 11 మందికి మాత్రమే అవార్డులు ప్రదానం చేసేందుకు గంట సమయం కేటాయించడంపై వివాదం రేగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం ఐదు గంటలకు సభావేదికకు రాష్ట్రపతి చేరుకోగా.. సాయంత్ర 3:30 నిమిషాల నుండే ఆ పదొకొండు మంది అవార్డులను మినహాయించి మిగిలిన వారికి కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేతులమీదుగా అవార్డులు అందజేస్తున్నట్లు ముందుగానే ప్రకటించడంతో సుమారు 65 మంది అవార్డు గ్రహీతలు జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.

రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ను అందుకోవడం ఆనవాయిగా వస్తుందని.. 65 ఏళ్ల సాంప్రదాయాన్ని కాదని కేవలం కొందరికి మాత్రమే రాష్టపతి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయడం పట్ల అభ్యతరం తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు.

కాగా ఈ అవార్డుల కార్యక్రమంలో భాగంగా మామ్ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు దివంగత నటి శ్రీదేవి. ఈ అవార్డును శ్రీదేవి భర్త బోనీ కపూర్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.