యాప్నగరం

నేనూ శాంపిల్స్ ఇచ్చాను: నవదీప్

నాంపల్లి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో ఐదో రోజు సినీనటుడు నవదీప్ విచారణ..

TNN 24 Jul 2017, 10:33 pm
నాంపల్లి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో ఐదో రోజు సినీనటుడు నవదీప్ విచారణ ముగిసింది. ఉదయం 10:30 గంటలకి ప్రారంభమైన ఈ విచారణ దాదాపు 11 గంటలకిపైగా జరిగింది. విచారణ ముగిసిన అనంతరం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడిన నవదీప్.. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చినట్టు తెలిపాడు.
Samayam Telugu navadeeps investigation completed for today in tollywood drugs racket case
నేనూ శాంపిల్స్ ఇచ్చాను: నవదీప్


మళ్లీ అవసరమైతే ఫోన్ కాల్ చేస్తామని సిట్ అధికారులు అన్నారని చెప్పిన నవదీప్... నార్కోటిక్స్ టెస్ట్ కోసం తాను ఇష్టపూర్తిగానే శాంపిల్స్ ఇచ్చినట్టు స్పష్టంచేశాడు. ఇవాళ నవదీప్ విచారణ ముగియగా రేపు ఆర్ట్ డైరెక్టర్ చిన్నా సిట్ విచారణకి హాజరు కానున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.