యాప్నగరం

తొలిసారిగా అలాంటి విలక్షణమైన పాత్రలో నయనతార.. ఆసక్తికరంగా ‘నేత్రికన్’ ట్రైలర్

ఒకప్పుడు గ్లామరస్ పాత్రలు మాత్రమే చేసి.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నయనతార.. ఇప్పుడు విలక్షణమై పాత్రలు చేస్తూ.. లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగారు. కాగా, తన లేటెస్ట్ మూవీ ‘నేత్రికన్‌’లో కెరీర్‌లో తొలిసారిగా ఓ డిఫెరెంట్ పాత్రలో ఆమె నటించారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

Samayam Telugu 30 Jul 2021, 6:45 pm
కొందరు హీరోయిన్లు మాత్రమే హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకుంటారు. అలా హీరోలతో సమానంగా దక్షిణాదితో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న నటి నయనతార. కెరీర్ ఆరంభంలో పలు గ్లామరస్ పాత్రల్లో నటించిన ఆమె స్టార్ హీరోయిన్ స్టాయిని సంపాదించుకుంది. అలాగే మంచి కెరీర్‌ని ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లోనూ కొనసాగించింది. అయితే కొంతకాలం తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది నయనతార. ఆ తర్వాత ఎక్కువ శాతం లేడీ ఓరియేంటెడ్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది.
Samayam Telugu నేత్రికన్
Netrikan


మధ్యలో కొన్ని కమర్షిషల్ సినిమాలు చేస్తూనే.. లేడీ ఓరియేంటెడ్ సినిమాలు చేస్తున్నారు ఆమె. కొన్ని రోజుల క్రితం ‘ముక్కుత్తి అమ్మన్’ (తెలుగులో అమ్మోరు తల్లి) సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరోసారి ఓ ఆసక్తికర కథనంతో, విభిన్నమైన పాత్రతో ఆమెను ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘నేత్రికన్’. ఈ సినిమాలో నయనతార తొలిసారిగా ఓ అంధురాలి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలో ఓ ప్రముఖ ఓటీటీలో విడుదల కానుంది.

తెలుగు, తమిళ భాషలతో పాటు మలయాళ, కన్నడ భాషలలోనూ ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. అమ్మాయిలను కిడ్నాప్ చేసే ఓ సీరియల్ కిల్లర్ బారిన పడిన హీరోయిన్.. అతని నుంచి ఎలా తప్పించుకుంటుంది అనే నేపథ్యంలో సినిమా రూపొందినట్లు ట్రైలర్ చేస్తూ అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అంధురాలి పాత్రలో నయనతార నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్‌లో అలరిస్తుందో తెలియాలి అంటే.. ఆగస్టు 13వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమాకు మిలింద్ రావ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.