యాప్నగరం

మనస్సులో ఏముందో తెలుసుకోవచ్చు?

పుట్టుకతో ఏ మనిషి దుర్మార్గుడు కాదు, వ్యసనపరుడు కాదు. పరిస్థితుల ప్రభావం వలన ప్రతి మనిషి మారతాడు,ఒక మనిషి మనస్సులో ఏముందో ఎలా సైంటిఫిక్‌గా తెలుసుకోవచ్చు...?

TNN 25 Dec 2016, 12:31 pm
పుట్టుకతో ఏ మనిషి దుర్మార్గుడు కాదు, వ్యసనపరుడు కాదు. పరిస్థితుల ప్రభావం వలన ప్రతి మనిషి మారతాడు, ఒక మనిషి మనస్సులో ఏముందో ఎలా సైంటిఫిక్‌గా తెలుసుకోవచ్చు? మనిషి భావ తరంగాలను చూడగలిగినా.. కొలవగలిగినా.. తద్వార మనిషి మనస్సులో ఏముందో తెలుసుకోవచ్చు. అనే కథాంశంతో బహుబలి, భజరంగీ భాయ్‌జాన్ చిత్రాల రచయితగా ఖ్యాతి గడించిన విజయేంద్ర ప్రసాద్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైంటిఫిక్ ఎరోటిక్ థ్రిల్లర్ సినిమా "శ్రీవల్లి". ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన తొలి టీజర్ విడుదలయింది.
Samayam Telugu neha hinges srivalli telugu film teaser released
మనస్సులో ఏముందో తెలుసుకోవచ్చు?




ఈ చిత్రం ద్వారా రజత్‌ హీరోగా, మాజీ మిస్ ఇండియా నేహా హింగే హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. 'రాజన్న చిత్రం తర్వాత మరోసారి 'శ్రీవల్లి' ద్వారా విజయేంద్ర ప్రసాద్ మరోసారి మెగా ఫోన్ అందుకున్నారు. ఈ చిత్రం విభిన్నమైన కథాంశంతో ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని చిత్ర నిర్మాత రాజ్‌కుమార్ బృందావనం పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. త్వరలోనే ఆడియో విడుదల చేసి, ఆ తర్వాత సినిమా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.