యాప్నగరం

చిరు సినిమాలో నీహారిక..!

నాగబాబు కూతురు నీహారిక 'ఒక మనసు' చిత్రంతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

TNN 31 Aug 2016, 4:36 pm
నాగబాబు కూతురు నీహారిక 'ఒక మనసు' చిత్రంతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన రెండో సినిమా ప్లాన్ చేస్తునే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అయితే తన పెదనాన్న చిరంజీవి నటిస్తోన్న 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో తనకు కూడా నటించాలనుందని గతంలో వెల్లడించింది.
Samayam Telugu niharika got role in chirus 150th film
చిరు సినిమాలో నీహారిక..!

కూతురు కోరిక కాదనలేని చిరంజీవి, నీహారిక కోసం ప్రత్యేకంగా ఓ గెస్ట్ రోల్ రాయమని దర్శకుడు వి.వి.వినాయక్ కు చెప్పారట. దీంతో నీహారిక, చిరు సినిమాలో నటించడం ఖాయమనే విషయం అర్థమవుతుంది. నీహారికతో పాటు సినిమాలో ఒక పాటలో సాయిధరం తేజ్ కూడా కనిపించనున్నాడని టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. కాజల్ కు చిరంజీవికి మధ్య వచ్చే సన్నివేశాలను త్రీకరిస్తున్నారు. త్వరలోనే నీహారిక కూడా షూటింగ్ లో పాల్గొనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.