మెగాబ్రదర్ నాగబాబు కూతురు నీహారిక 'ఒక మనసు' చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. అయితే మొదటి సినిమా ఆశించినంత విజయాన్ని అందించలేకపోయింది. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న నీహారిక ఇప్పుడే కథలు వినడం మొదలుపెట్టింది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టి టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడుతుందని తెలుస్తోంది.
అయితే అది ఓ స్టార్ హీరో సినిమాలో నటిస్తేనే తనకు క్రేజ్ వస్తుందని భావించిన ఈ మెగా ప్రిన్సెస్ దానికోసం నందమూరి వారబ్బాయి ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకుంటోంది. గతంలో ఎన్టీఆర్ అంటే ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. మెగాకుటుంబానికి, నందమూరి కుటుంబానికి అభిమానుల సంఖ్య ఎక్కువే కాబట్టి తారక్‌తో కలిసి సినిమా చేస్తే ఖచ్చితంగా తన కెరీర్‌కు ప్లస్ అవుతుందని భావించి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. నీహారిక ఆలోచన బాగానే ఉంది కానీ మరి ఎన్టీఆర్ తనకు ఆ అవకాశం ఇస్తాడో లేదో చూడాలి.