యాప్నగరం

మెగా డాటర్ అక్కడైనా మెరుస్తుందా..

మెగా డాటర్ నిహారిక తెలుగులో కలిసి రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి పయనమైంది.

TNN 16 Feb 2017, 4:41 pm
మెగా డాటర్ నిహారిక తెలుగులో కలిసి రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి పయనమైంది. ఒక వైపు వెబ్ సిరీస్‌లో నటిస్తూనే.. ఢీ షోలో యాంకర్‌గా తన సత్తా చాటిన మెగా హీరోయిన్ నీహారిక 'ఒక మనసు' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. అయితే అనుకున్న రీతిలో ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
Samayam Telugu niharika set for tamil debut with vijay sethupathi
మెగా డాటర్ అక్కడైనా మెరుస్తుందా..


దీంతో నీహారిక తను చేయబోయే తదుపరి సినిమా అందరికీ నచ్చే విధంగా ఉండాలని మంచి కథ కోసం ఎదురుచూస్తూ ఉంది. ఇప్పుడు ఆమెకు నచ్చే కథ ఆమెను వెతుక్కుంటూ వెళ్లిందని తెలుస్తోంది. తమిళ దర్శకుడు అరు మురుగన్, విజయ్ సేతుపతితో సినిమా చేయాలనుకుంటున్నాడు. హీరోయిన్ పాత్రకు నీహారిక అయితే బావుంటుందని ఆమెను సంప్రదించడం.. దానికి ఆమె ఒప్పుకోవడం జరిగిపోయిందని అంటున్నారు.

ఈ సినిమా షూటింగ్ మార్చి 6 నుండి జరగనుందని సమాచారం. మరి ఈ సినిమాతో అయినా.. నీహారిక తొలి సక్సెస్‌ను అందుకుంటుందేమో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.