యాప్నగరం

హాట్ ఫొటోతో కిక్కిచ్చిన నిహారిక.. బాబోయ్! పెళ్లి తర్వాత మరింత వేడిపుట్టిస్తున్న మెగా డాటర్

పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది నిహారిక. భర్తతో దిగిన రొమాంటిక్ లుక్స్ షేర్ చేస్తూ రచ్చ చేస్తున్న ఆమె తాజాగా ఓ హాట్ ఫొటో షేర్ చేసి చర్చల్లో నిలిచింది.

Samayam Telugu 7 Jan 2021, 5:30 pm
మెగా డాటర్ నిహారిక పెళ్లి తర్వాత ట్రాక్ ఛేంజ్ చేసినట్లు ఆమె పోస్ట్ చేస్తున్న ఫొటోలు చూస్తుంటే అర్థమవుతోందని అంటున్నారు నెటిజన్లు. భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యతో సరదాగా ఎంజాయ్ చేస్తూ రొమాంటిక్ పిక్స్ షేర్ చేస్తోంది మెగా డాటర్. సినిమాల్లో పెద్దగా అలరించలేకపోయినా కూడా.. ఇటీవల ఆమె పెళ్లి తాలూకు విషయాలు నెట్టింట ట్రెండింగ్ అయ్యాయి. దీంతో ఆ ట్రెండ్ అలాగే కంటిన్యూ చేస్తూ సోషల్ మీడియాలో ఫొటోలతో కిక్కివ్వడం ప్రారంభించింది నిహారిక.
Samayam Telugu హాట్ ఫొటోతో కిక్కిచ్చిన నిహారిక..
Niharika Konidela


పెళ్లికి ముందు వస్త్రాధారణ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కువగా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించే మెగా డాటర్.. పెళ్లి కాగానే రూటు మార్చేసి మోడ్రన్ డ్రెస్సులేస్తూ వేడి పుట్టిస్తుండటం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే భర్తతో కలిసి మాల్దీవులకు హనీమూన్ ట్రిప్ వేసిన నిహారిక అక్కడ కూడా దుమ్ములేపింది. హాట్ హాట్ డ్రెస్సులతో ఫొటోలు దిగి సోషల్ మీడియాను షేక్ చేసింది.
చిన్న పొరపాటుతో అడ్డంగా బుక్కైన నాగబాబు! తప్పని పరిస్థితుల్లో వెనక్కితగ్గిన మెగా బ్రదర్..
దీంతో నిహారిక ఇలా పొట్టి నిక్కర్లు, పొట్టి డ్రెస్సులతో ఆశ్చర్యపరుస్తుండటం వెనుక సీక్రెట్ ఏంటని జనాల్లో టాక్ మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట క్షణాల్లో వైరల్‌ అయింది. ఈ ఫొటోలో బ్లూ జీన్స్ టాప్‌ ధరించి యమ హాట్‌గా పోజివ్వడమే గాక.. ఈ సమయంలో ఈ ప్లేస్ అని ట్యాగ్ చేసింది నిహారిక. ఈ ఫొటో చూసిన నెటిజన్స్ కొందరు 'వావ్ నిహారిక బ్యూటీఫుల్' అని కామెంట్ చేస్తుంటే ఇంకొందరు మాత్రం 'పెళ్లయ్యాక ఆ డ్రెస్సులేంటి?' అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.