యాప్నగరం

ఆ రోజున 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ?

హీరో నిఖిల్, హెబాప‌టేల్, నందిత శ్వేతలు ప్రధాన పాత్రలుగా నటించిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సైన్మాలోని పాటను మరియు విడుదల తేదీను విడుదల చేశారు...

TNN 7 Nov 2016, 7:26 pm
యంగ్ హీరో నిఖిల్ 'స్వామిరారా', 'కార్తికేయ‌', 'సూర్య vs సూర్య' లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో వచ్చిన సూప‌ర్‌హిట్ చిత్రాలలో నటించి సక్సెస్‌ఫుల్ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు నిఖిల్ మ‌రోసారి వినూత్న‌మైన క‌థాంశంతో వ‌స్తున్న చిత్రం 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా'. వి.ఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్‌కి జంట‌గా హెబాప‌టేల్, నందిత శ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. సినిమాలోని తొలి పాటను ప్రముఖ దర్శకుడు వి.వి వినాయక్ విడుదల చేశారు. కాగా, ఈ సినిమా ఆడియో ఈ వారంలోనే విడుదల చేయ‌నున్న‌ట్లు యూనిట్ సభ్యులు తెలిపారు.
Samayam Telugu nikhil and hebbah patel duo coming up with ekkadiki pothavu chinnavada film on november 18th
ఆ రోజున 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ?





వెన్నెల కిషోర్‌, తనికెళ్ళ భ‌ర‌ణి, స‌త్య‌, తాగుబోతు ర‌మేష్‌, జోష్ రవి, వైవా హ‌ర్ష‌, సుద‌ర్శ‌న్ తదితరులు ఇతర తారాగణంగా నటించారు. సెన్సార్ పూర్తి చేసుకుని యూ/ఎ సర్టిఫికెట్ పొందిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రం న‌వంబ‌ర్ 18న విడుదలవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.