యాప్నగరం

Nikhil Siddhartha ‘18 పేజీస్’ మూవీ ఓటీటీలోకి.. ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుందంటే?

18 Pages OTT లోకి వచ్చేస్తోంది. గత ఏడాది డిసెంబరులో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకోవడంతో పాటు పాతిక కోట్ల వరకూ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాని రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఒకే రోజు స్ట్రీమింగ్‌కి ఉంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో మొదటి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా కాగా.. రెండోది నెట్‌ప్లిక్స్ సంస్థ. ఈ మేరకు అధికారికంగా రెండూ ఈ మూవీ స్ట్రీమింగ్‌పై ప్రకటనలు విడుదల చేశాయి.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 14 Jan 2023, 7:49 pm

ప్రధానాంశాలు:

  • ఓటీటీలోకి రాబోతున్న 18 పేజీస్ మూవీ
  • గత ఏడాది డిసెంబరు 23న థియేటర్లలోకి రిలీజ్
  • పాతిక కోట్లు వరకూ కలెక్ట్ చేసిన సినిమా
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu 18 Pages OTT
18 పేజీస్ మూవీ
నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha) హీరోగా నటించిన ‘18 పేజీస్’ (18 Pages) మూవీ త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. గత ఏడాది డిసెంబరు 23న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని.. మంచి కలెక్షన్లు రాబట్టింది. సీనియర్ దర్శకుడు సుకుమార్ ఈ మూవీకి కథ అందించగా.. అతని శిష్యుడు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు. ఫీల్ గుడ్ లవ్‌స్టోరీగా యూత్‌ని ఆకట్టుకున్న ఈ మూవీలో నిఖిల్‌కి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది.
టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ ఈ మూవీని సమర్పించగా.. బన్నీ వాసు నిర్మించారు. సిద్దు పాత్రలో నిఖిల్ సిద్ధార్థ్ నటించగా.. నందిని పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటించింది. కొత్త తరహా లవ్ స్టోరీ.. పాటలు, విజువల్స్ కూడా బాగా ఉండటంతో.. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌‌ని కూడా ఈ మూవీ థియేటర్‌కి రప్పించగలిగింది. అన్నింటికీ మించి క్లైమాక్స్ ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

18 పేజీస్ మూవీ సుమారు రూ.25 కోట్ల వరకూ కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఇప్పటికే అల్లు అరవింద్‌కి చెందిన ఓటీటీ ప్లాట్‌‌ఫామ్ ‘ఆహా’ వద్ద ఉన్నాయి. కానీ.. తాజాగా నెట్‌ప్లిక్స్ కూడా త్వరలోనే ఈ సినిమాని స్ట్రీమింగ్‌కి ఉంచబోతున్నట్లు ప్రకటించింది. దాంతో ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‌కి ఉంచే అవకాశం ఉంది.

కథ ఏంటంటే? సిద్ధు (నిఖిల్‌) ఓ కంపెనీలో యాప్‌ డెవలపర్‌గా పనిచేస్తుంటాడు. అక్కడ ప్రీతి అనే అమ్మాయిని ప్రేమించి మోసపోతాడు. ఆ బాధలో రోడ్లపై తిరుగుతున్న సమయంలో ఒక డైరీ దొరుకుతుంది. అది నందిని (అనుపమ పరమేశ్వరన్‌) మూడేళ్ల క్రితం రాసుకున్న డైరీ. టెక్నాలజీ దూరంగా ఉండే ఆ అమ్మాయి ఓ పని మీద హైదరాబాద్‌కు వస్తుంది. ఆ తర్వాత చిక్కుల్లో పడుతుంది. అయితే ఆ డైరీ చదివిన సిద్ధు.. నందినితో సిద్ధు ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఆమె ఓ కారు ప్రమాదంలో చనిపోయినట్టు తెలిసి బాధపడతాడు. కానీ.. డైరీలో ఉన్న దాన్ని బట్టి రెండేళ్ల క్రితం ఏం జరిగిందో తెలుసుకునే ట్రై చేస్తాడు. ఈ క్రమంలో కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అవేంటి అనేది సినిమాలో చూడాల్సిందే.

Read Latest Telugu Movies News , Telugu News
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.