యాప్నగరం

మోహన్‌బాబు ‘గాయత్రి’గా ఈమెనా..!

డైలాగ్ కింగ్ మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాయత్రి’. మదన్ దర్శకత్వం వహిస్తున్నారు.

TNN 4 Feb 2018, 4:06 pm
డైలాగ్ కింగ్ మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాయత్రి’. మదన్ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌బాబు సొంత బ్యానర్‌ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నిర్మిస్తున్న 42వ చిత్రమిది. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు. మంచు విష్ణు, శ్రియ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలోని పాత్రలను ఇప్పటి వరకు ఒక్కటొక్కటిగా విడుదల చేస్తూ వచ్చారు. అయితే టైటిల్ రోల్ అయిన ‘గాయత్రి’ని మాత్రం చూపించలేదు. ఫిబ్రవరి 9నే ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో తాజాగా ‘గాయత్రి’ పాత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
Samayam Telugu nikhila vimal as gayatri in mohan babus gayatri movie
మోహన్‌బాబు ‘గాయత్రి’గా ఈమెనా..!


మలయాళం, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిలా విమల్ ‘గాయత్రి’ సినిమాలో టైటిల్ రోల్ పోషించింది. అల్లరి నరేష్ హీరోగా కిందటేడాది వచ్చిన ‘మేడ మీద అబ్బాయి’ సినిమా ద్వారా నిఖిలా విమల్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇప్పుడు మోహన్‌బాబు లాంటి పెద్ద నటుడు, నిర్మాత నిర్మించిన చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. మోహన్‌బాబు కూతురిగా నిఖిలా కనిపించనున్నట్లు సమాచారం.

టీజర్, ట్రైలర్‌తో ఇప్పటికే ‘గాయత్రి’పై అంచనాలు ఏర్పడ్డాయి. మంచి తారాగణం, ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న తమన్ సంగీతం అందించడం, చాలా కాలం తరవాత మోహన్‌బాబు పవర్‌ఫుల్ పాత్రలో నటించడం ఇలా అన్నీ ఈ సినిమాకు కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ దక్కింది. అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.